ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తన ప్రమేయంపై లేకుండానే గోవిందుడు కూడా ఒక భాగమైపోయారు, అలాగే ఒక బాధితుడిగా మారారు.
అటు అధికార ఇటు ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆ ఏడుకొండల వాడు తన పట్ల జరిగిన, జరుగుతున్న ఆచారాలకు – అపచారాలకు మధ్య నోరువిప్పలేని సాక్షిగా శిలా రూపంలో చూస్తూన్నారు.
తిరుమల లడ్డు ప్రసాదం నెయ్యిలో కల్తీ అంటూ మొదలైన ఈ ప్రచారం ఇప్పుడు జంతు కొవ్వు దగ్గరకొచ్చి ఆగింది. ప్రభుత్వమేమో శ్రీవారి ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగింది, ఆ కల్తీలో జంతు కొవ్వు కూడా మిళితమయ్యింది అంటూ వాదిస్తుంది.
అలాగే సిట్ నివేదికలో కొన్ని అంశాలు ప్రభుత్వ వాదనకు బలం చేకూర్చాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని, అదొక సింథటిక్ మిశ్రమం అని తేల్చింది.
పామ్ ఆయిల్, కొన్ని రకాల ప్రమాదకర రసాయనాల కలియికతో తయారు చేసిన నెయ్యి లాంటి ఒక మిశ్రమాన్ని బాలాజీ లడ్డు ప్రసాదంలో వాడినట్టు సిట్ నివేదికిచ్చింది. అలాగే NDDB రిపోర్ట్ ప్రకారం ఆ నెయ్యిలో జంతు కొవ్వు కూడా కలిసినట్టు నిర్ధారణ జరిగింది.
అయితే ఇలా రిపోర్ట్ లన్ని కూడా వైసీపీకి వ్యతిరేకంగా, తిరుమల లడ్డు విషయంలో అపచారం జరిగినట్టుగా వచ్చినప్పటికీ వైసీపీ మాత్రం ఆ ‘నారాయణుడి చుట్టూ నీలి మేఘాలను’ కమ్మెందుకు సిద్ధమయ్యింది. తమ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు నెయ్యి విషయంలో ఎటువంటి కల్తీ జరగలేదంటూ వైసీపీ నీలి ప్రచారాలు మొదలు పెట్టింది.
తిరుమల వంటి పుణ్య క్షేత్రం, అక్కడ లభించే శ్రీవారి లడ్డు ప్రసాదం యావత్ హిందూ సమాజానికి ఎంతో పవిత్రమైనది. అటువంటి పవిత్ర ప్రసాదంలో కల్తీ అంటే అది ఆ దేవదేవునికి చేసిన అన్యాయమే అవుతుంది, ఆ ఏడుకొండల వాడికి తలపెట్టిన మహాపచారం కిందకే వస్తుంది.
అలాగే అది ఆ గోవిందుడి భక్తుల మనోభావాలతో చేసిన అక్రమ కల్తీ వ్యాపారమే అవుతుంది. అటువంటి అన్యాయం, అపచారం, అక్రమ కల్తీ వ్యాపారానికి వైసీపీ నీలి రంగు పూసి సక్రమం చెయ్యాలని చూస్తుంది, అపచారానికి ఆచారం ముసుగు తొడలగాలి భావిస్తుంది, అలాగే చేసిన అన్యాయానికి న్యాయం జరిగిందంటూ వాదిస్తుంది.
ఇదిలా ఉంటే ఒక పక్క వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ కలిసిన మాట వాస్తవమే కానీ జంతు కొవ్వు కలవలేదు అంటూ మీడియా ముఖంగా దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తప్పు జరిగినట్టు ఒప్పుకున్నారు.
ఇక్కడ మరోపక్క జగన్ అండ్ కో తన సాక్షి నుంచి బ్లూ మీడియా వరకు నెయ్యి లో కల్తీ జరగలేదంటూ, ఇది ప్రభుత్వం చేస్తున్న కుట్ర అంటూ, కూటమి సనాతన ధర్మం పేరుతో ఆడుతున్న రాజకీయ డ్రామా అంటూ నీలి ప్రచారం మొదలు పెట్టింది, అదే నిజమని నమ్మించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కల్తీ నెయ్యి వ్యవహారానికి కుల రాజకీయాలను జోడించింది.
అలాగే అసలు కల్తీ, నెయ్యి ట్యాంకర్ లో కలిసిందా లేదా శాంపిల్స్ లో కల్తీ జరిగిందా.? నెయ్యి లో కల్తీ జరిగినా అందులో జంతు కొవ్వు కలవలేదుగా.? అంటూ వితండవాద డిబేట్లు, వింత కథనాలు ప్రచారం చేస్తూ కూటమి ప్రభుత్వం పై మాత్రం పచ్చ పాపాలంటూ, దైవద్రోహలంటూ, కొండంత అపచారమంటూ,
ఈ విధంగా వైసీపీ నారాయణుడి లడ్డు ప్రసాదం కల్తీ నిజాలు బయటకు రాకుండా నీలి మేఘాలు కప్పాలని చూస్తుంది, అదే విధంగా ఆ గోవిందుడిని అడ్డుపెట్టుకుని కుల మత రాజకీయ ఆటకు పదును పెట్టింది .
ఈ క్రమంలో సాక్ష్యాత్తు ఆ కలియుగ దేవుడు వెంకన్న స్వామే స్వయంగా వచ్చి తన లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ వాపోయినా దాన్ని కూడా తనకు అనుకూలంగా మలచుకుని నీలి ప్రచారాలు చేయగలిగే స్థాయికి వైసీపీ దిగజారిపోయిందా అన్నట్టుగా తిరుమల లడ్డు ప్రసాదం పై వైసీపీ నీలి మేఘాలు కమ్ముతున్నాయి.
మరి వాటిని తొలగించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలిస్తాయా.? లేదా ఆ గోవిందుడే మరో రూపంలో వచ్చి తన పై, తన ప్రసాదం పై జరుగుతున్న ఈ కల్తీ ప్రచారానికి ముగింపు పలుకుతారా అంటున్నారు శ్రీవారి భక్తులు..!






