tollywood-and-revanth-reddy-who-is-the-winner

అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేతతో సినీ పరిశ్రమకి తెలంగాణ ప్రభుత్వానికి మద్య దూరం మొదలైందని భావించవచ్చు.

ఈ విషయంలో సిఎం రేవంత్ రెడ్డి చట్ట ప్రకారమే వ్యవహరించినప్పటికీ, ఇప్పుడు కూల్చివేతల విషయంలో హైడ్రా వెనక్కు తగ్గడంతో అంతకు ముందు దుందుడుకుగా వ్యవహరించిన్నట్లు అంగీకరించిన్నట్లయింది.

Also Read – జగన్‌ కళ్లెదుటే అమరావతి నిర్మాణం… భరించడం కష్టమే!

పేదలు, మద్యతరగతి ప్రజల ఇళ్ళు, వారి దుకాణాలు నిర్ధాక్షిణ్యంగా కూల్చేసిన హైడ్రా, ఓవైసీ, మల్లారెడ్డి, బిఆర్ఎస్ నేతల ఆక్రమణలను టచ్ చేయలేకనే ఇప్పుడు ‘యూటర్న్’ తీసుకొని, హైడ్రా ఏర్పాటుకి ముందు ఆక్రమణలను తొలగించబోమంటూ కొత్త స్టోరీ చెపుతోందని సామాన్య ప్రజలు భావిస్తున్నారు.

ఇది పక్కన బెడితే, ఎన్‌ కన్వెన్షన్ కూల్పించేసి రేవంత్ రెడ్డి టాలీవుడ్‌కి తొలి హెచ్చరిక జారీ చేసిన్నట్లు భావించవచ్చు. కానీ అప్పుడు టాలీవుడ్‌ స్పందించలేదు. గతంలో ఇదే సమస్య ఎదురైనప్పుడు నాగార్జున వెంటనే అప్పటి సిఎం కేసీఆర్‌ని కలిసి మాట్లాడారు. ఆ తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్‌ కన్వెన్షన్ జోలికి వెళ్ళలేదు.

Also Read – కాళేశ్వరం సమస్యలు, పరిష్కారాలు.. అన్నీ ఆయనే!

కానీ ఈసారి నాగార్జున సిఎం రేవంత్ రెడ్డిని కలిసే బదులు హైకోర్టుని ఆశ్రయించారు. తద్వారా రేవంత్ రెడ్డికి సవాలు విసిరిన్నట్లయింది.

ఆ తర్వాత గద్దర్ అవార్డుల విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రతిపాదనని టాలీవుడ్‌ పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి మంత్రులు కొండా సురేఖ, సీతక్కలని సొంత చెల్లెలుగా గౌరవిస్తుంటారు. కొండా సురేఖ క్షమాపణలు చెప్పినప్పటికీ, దూకుడు తగ్గించుకోమని పీసీసీ అధ్యక్షుడు హితవు చెప్పినప్పటికీ నాగార్జున ఆమెపై క్రిమినల్ కేసు, వంద కోట్లకు పరువునష్టం దావా కేసు వేశారు.

Also Read – ఐశ్వర్య రాజేష్..మరో అంజలి అవుతారా.?

అల్లు అర్జున్‌కి సినీ ప్రముఖుల పరామర్శలు, అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వడం వీటన్నిటికీ పరాకాష్టగా చెప్పుకోవచ్చు.

కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డికి శాలువాలు కప్పి, బొకేలు చేతిలో పెట్టి పొగిడితే బుట్టలో పడతారనుకోవడం అత్యాశే అవుతుంది.

ఇటు సినీ పరిశ్రమ, అటు తెలంగాణ ప్రభుత్వం ఇరువైపులా కొన్ని తప్పులు జరిగాయి. ఈ సమావేశంలో వాటన్నిటినీ సరిదిద్దుకునే అవకాశం ఇరువర్గాలకు కలిగింది. కానీ ఎవరూ తప్పులు ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. కనుక ఇరువర్గాలు నష్టపోతున్నాయి.




కనుక ఈ సమావేశం తర్వాత టాలీవుడ్‌ పెద్దలు ఓడిపోయిన భావనతో, అవమానభారంతో వెనుతిరిగారు. బంగారు బాతు వంటి టాలీవుడ్‌ పట్ల రేవంత్ రెడ్డి అవసరానికి మించి చాలా కటువుగా వ్యవహరించారనే విమర్శలు మూటకట్టుకోబోతున్నారు.