ys-jagan-chandrababu

ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో ఒకే సమయంలో పూర్తి భిన్నమైన రెండు దృశ్యాలు కనిపిస్తున్నాయి. జగన్‌ రాక్షస పాలన నుంచి విముక్తి లభించిందని రాష్ట్రంలో అనేక వర్గాలు పండగ చేసుకుంటుంటే మరోపక్క జగన్‌ చేయించిన తప్పుడు పనులకు, లేదా జగన్‌ వైసీపి నేతల అండదండలు చూసుకొని విర్రవీగినందుకు ఇప్పుడు మూల్యం చెల్లించక తప్పదని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చినందుకు తెలుగు సినీ పరిశ్రమ చాలా సంతోషంగా ఉంది. ఇంతకాలం జగన్‌ సినీ పరిశ్రమను వేధించి, సినీ ప్రముఖులను అవమానించి, సినీ రంగానికి చెందిన వర్మ, పోసాని, రోజా వంటి చేతే తిట్టించేవారు.

Also Read – తగలబడినవి ఆ దస్త్రాలేనా?

పవన్‌ కళ్యాణ్‌, బాలకృష్ణ సినిమాలు ప్రదర్శించినందుకు పలు థియేటర్ యజమానులు కూడా వేధింపబడ్డారు. వారు కూడా ఇప్పుడు చాలా సంతోషిస్తున్నారు.

కూటమిలోనే సినీ పరిశ్రమకు చెందిన నందమూరి బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ ఉండటంతో తమ కష్టాలన్నీ తీరిపోతాయని సినీ పరిశ్రమలో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు.

Also Read – బురద జల్లుతున్నా బాబు ప్రతిష్ట ఇలా పెరిగిపోతోందేమిటి?

జగన్‌ మూడు రాజధానుల పేరుతో ఆడిన డ్రామాలతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా దెబ్బ తింది. ఇది చాలదన్నట్లు వైసీపి నేతల ఇసుక దోపిడీ, భూకబ్జాలు, వేదింపులు, బెదిరింపులు, దౌర్జన్యాలతో ఇంతకాలం విలవిలలాడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు జగన్‌ రాక్షస పాలన నుంచి విముక్తి లభించిందని, రియల్ ఎస్టేట్ రంగానికి మళ్ళీ మంచి రోజులు మొదలయ్యాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు కూడా జగన్‌ ప్రభుత్వ బాధితులే కనుక వారు కూడా జగన్‌ రాక్షస పాలన అంతమైనందుకు చాలా సంతోషంగా ఉన్నారు.

Also Read – జీఎస్టీ ఆదాయం తగ్గితే.. సిగ్గు పడాల్సింది బాబు కాదు.. జగనే!

టిడిపి నేత ధూళిపాళ నరేంద్ర, చంద్రబాబు నాయుడు తదితరుల ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు జగన్‌ గుజరాత్ నుంచి అమూల్ డెయిరీని ఆంధ్రాకు రప్పించారు. దాని వలన లాభాల బాటలో సాగుతున్న సంగం, హెరిటేజ్ డెయిరీలు ఎలాగూ తీవ్రంగా నష్టపోయాయి. వాటితో పాటు అసలు ఈ రాజకీయాలతో ఏ మాత్రం సబంధం లేని రాష్ట్రంలో అనేక మంది ప్రైవేట్ డెయిరీ యజమానులు కూడా జగన్‌ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోయారు. వారందరూ ఇప్పుడు జగన్‌ పీడా విరగడ అయ్యిందని చాలా సంతోషిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు ఐ‌టి కంపెనీలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కనుక ఆయన తమకు తప్పకుండా మేలు కలిగే నిర్ణయాలు తీసుకుంటారని నమ్మకంతో ఉన్నాయి.

అమరావతి రైతుల ఆనందానికి అంతే లేదు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతునందుకు అందరూ మిఠాయిలు పనుకున్నారు. నాలుగేళ్ళుగా చేస్తున్న తమ ఆందోళన విరమించిన్నట్లు ప్రకటించారు.

ఇక మరోపక్క జగన్, వైసీపి నేతల అండదండలు చూసుకొని టిడిపి, జనసేన సానుభూతిపరులను, నేతలను, కార్యకర్తలను ఇంతకాలం వేధించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పుడు ఉద్యోగాలు చేయలేక, ఎటూ పారిపోలేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

చంద్రబాబు నాయుడుని కలిసేందుకు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండవల్లి నివాసానికి వస్తున్నారు. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్న చంద్రబాబు నాయుడు, తమపై అక్రమ కేసులు నమోదు చేసిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు సంజయ్, పిఎస్ఆర్ ఆజనేయులు, కొల్లి రఘురామరెడ్డిలకు చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ నిరాకరించారు.




సీఎస్ జవహర్ రెడ్డిపై కూడా తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ త్వరలో ఆయన పదవీ కాలం ముగుస్తుండటంతో అంతవరకు లాంగ్ లీవు తీసుకొని వెళ్ళిపోమ్మని చంద్రబాబు నాయుడు ఆదేశించిన్నట్లు తెలుస్తోంది. ఏబీ వేంకటేశ్వర రావుని జగన్‌ 5 ఏళ్ళపాటు వేధించారు. కానీ చంద్రబాబు నాయుడు జవహార్ రెడ్డి పట్ల ఆవిదంగా వ్యవహరించకుండా సెలవుపై వెళ్ళిపొమ్మని కోరడం ఆయనకు చాలా ఊరట కలిగించేదే.