tollywood-industry

ఒక్కో సమయంలో మౌనం మన బలహీనతను బయటపెడితే మరో సందర్భంలో ఆ మౌనమే మన ఆయుధంగా మారుతుంది. అలాగే కొన్ని కొన్ని సార్లు మౌనం సమాజం ముందు మనల్ని దోషిగా చూపిస్తే మరికొన్ని సార్లు అదే మౌనం మనల్ని సమాజం ముందు నిర్దోషిగా నిలబెడుతుంది.

అంటే ఇక్కడ సమయానికి తగ్గట్టుగా నడుచుకోవడం, సందర్భానికి తగ్గట్టుగా స్పందించడం అనేది అత్యంత కీలకమైన అంశంగా పరిగణించబడుతుంది అన్న మాట. అయితే ఈ ఉపాధ్ఘాతం మొత్తం తెలుగు సినీ పరిశ్రమ పెద్దలకు సరిగ్గా సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో సినీ పరిశ్రమలో మొదలైన రాజకీయ పార్టీల పెత్తనం నానాటికి తన పరిధిని పెంచుకుంటూ పోయింది.

Also Read – జగన్‌ మార్క్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో సినీ పరిశ్రమను కూడా వదలకుండా ఉద్యమాల పేరుతో వారిని కూడా టార్గెట్ చేసిన తెరాస నాయకులు ఆ తరువాత జరిగిన పరిణామాలతో సినీ పరిశ్రమను తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నారు.

ఇక ఏపీలో వైసీపీ పార్టీ అధికారాన్ని చేపట్టకముందు వరకు తమ సెలబ్రెటీ హోదాకు ఎటువంటి భంగం కలగకుండా గడిపిన సినీ ప్రముఖులు వైసీపీ అధికారంలోకి రావడంతోనే వారి హోదాకు నీళ్లొదలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

Also Read – ‘ముద్రగడ’ పోయి…’జోగయ్య’ వచ్చారా.?

సినిమా టికెట్ల రేట్లు తగ్గింపు అంటూ ప్రకటించి సినీ సెలబ్రెటీలను తన ఇంటి గేటు వరకు రప్పించుకుని వారి స్థాయిని తగ్గించారు వైస్ జగన్. అలాగే ఈ సమస్య పరిష్కారం కోసం తెలుగు సినీ ఇండస్ట్రీ తరుపున చేతులు జోడించిన చిరంజీవిని అవమానించి పంపించారు జగన్.

అయితే ఆనాడు అందరికోసం తానొక్కడై వచ్చి అవమానాలు ఎదుర్కున్న చిరంజీవికి మద్దతుగా తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అలాగే ఆనాటి ప్రభుత్వ పైశాచిక ఆనందం మీద ఎటువంటి వ్యతిరేకత ప్రకటించలేదు సినీ ప్రముఖులు. నాటి మౌనం వారి నిస్సహాయతను తెలియచేసింది.

Also Read – ప్రకృతి విపత్తులకు ఎన్‌డీఆర్ఎఫ్, జగన్‌ విధ్వంసానికి…

అయితే నాడు వైసీపీ ప్రభుత్వంలో తమకు జరిగిన అన్యాయం మీద గొంతెత్తలేక తమకు జరిగిన అవమానాలను ప్రశ్నించలేక మౌనంగా ఉన్న టాలీవుడ్ అపఖ్యాతిని మూటకట్టుకుంది. కానీ నేడు అల్లు అర్జున్ నిర్లక్ష్యం మీద గొంతెత్తి తెలంగాణ ప్రభుత్వం ముందు దోషిగా నిలబడింది.




నాడు అందరి కోసం ఒక్కడు అంటూ తగ్గి ముందుకెళ్లిన టాలీవుడ్, నేడు ఒక్కడి కోసం అందరు తగ్గేదెలా అంటూ ముందుకొచ్చి టాలీవుడ్ కు తగ్గాల్సిందే అనే పరిస్థితిని తెచ్చుకున్నారు. నాడు జరిగిన ఒక్క నిర్లక్ష్యం ఒక కుటుంబానికి తీరని వేదనను మిగిలిస్తే సినీ పరిశ్రమకు తీర్చుకోలేని నష్టాన్ని తెచ్చి పెట్టింది.