producer-natti-kumar about tollywood

తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాత నట్టి కుమార్‌ ఎప్పుడూ కుండ బద్దలు కొట్టిన్నట్లే మాట్లాడుతుంటారు. ఆయన తాజా ఇంటర్వ్యూలో “సంధ్య థియేటర్‌ ఘటన.. తదనంతర పరిణామాల నేపధ్యంలో టాలీవుడ్‌ ఏపీకి తరలిరాబోతోందా?” అనే విలేఖరి ప్రశ్నకు “రాదు.. ఆ అవసరం లేదు కూడా,” అని తేల్చి చెప్పేశారు.

“ఆనాడు విజ్ఞప్తి చేసిన డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, సిఎం చంద్రబాబు నాయుడు కానీ ఇటు పరిశ్రమలో పెద్దలు గానీ మళ్ళీ ఆ ఊసే ఎత్తలేదు. ఆరోజు ఆ వేడిలో అందరూ ఏదో అన్నారు కానీ టాలీవుడ్‌ని ఏపీకి తీసుకువెళ్ళేందుకు అటు ఏపీ ప్రభుత్వం తరపు నుంచి గానీ ఇటు టాలీవుడ్‌ తరపు నుంచి గానీ ఎవరూ ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. కనీసం ఆలోచించలేదు.

Also Read – చెప్పేవి శ్రీరంగ నీతులు…చేసేవి వైసీపీ రాజకీయాలా.?

బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్‌ అటు రాజకీయాలలో, ఇటు సినీ పరిశ్రమలో కూడా ఉన్నారు. కానీ వారు కూడా ఏపీలో టాలీవుడ్‌ విస్తరించేందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ఈ దిశలో మళ్ళీ ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు.

ఓ పరిశ్రమకి భూమి కేటాయించేటప్పుడు ఎంత పెట్టుబడి పెడతారు?ఎంత మందికి ఉద్యోగాలు కల్పిస్తారు? అని ప్రభుత్వం అడుగుతుంది. టాలీవుడ్‌కి ఏపీ నుంచి 68 శాతం రాబడి వస్తోంది. కనుక ఏపీకి టాలీవుడ్‌ ఎంత ఆదాయం సమకూర్చుతుంది?అని అక్కడి ప్రభుత్వం తప్పక అడుగుతుంది.

Also Read – వంశీ జైలుకి… వైసీపీ కార్యకర్తలు సైలంట్?

ఏపీలో 30 శాతం సినిమా షూటింగ్ చేస్తేనే టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతిస్తామని గత ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు ఆ నిబందనతో సంబందం లేకుండా ‘మనవాళ్ళు’ అనే ఒకే ఒక్క కారణంతో అనుమతిస్తోంది.

ఏపీలో కూడా సినీ పరిశ్రమ ఏర్పాటు కావాలి. అభివృద్ధి చెందాలనే నేను కోరుకుంటున్నాను. కానీ ఆ దిశలో ఏపీ ప్రభుత్వం, సినీ పరిశ్రమలోవారు కూర్చొని మాట్లాడుకోవాలి కదా?కానీ అటువంటి ప్రయత్నాలే జరగనప్పుడు టాలీవుడ్‌ ఏపీకి ఎందుకు తరలివస్తుంది? రాదు.. ఆ అవసరం లేదు కూడా,” అని నిర్మాత నట్టి కుమార్‌ అన్నారు.

Also Read – ఐసీయూ లో ఉన్న వైసీపీకి చిరు ఊతమిస్తే…టీడీపీ ఊపిరి తీసింది.!


సినీ పరిశ్రమ ఏపీకి తరలి రావాలని మొక్కుబడిగా పిలిస్తే సరిపోదని, అందుకు తగిన కృషి కూడా అవసరమని నట్టి కుమార్‌ చెప్తున్న ఈ మంచి మాట ఎవరి చెవికైనా ఎక్కుతుందా?