సోషల్ మీడియాలో ప్రిన్స్ మహేష్ బాబు ఎప్పుడూ పెద్దగా హల్చల్ చేసింది లేదు. ‘ఖలేజా’ సినిమాకు ముందు ట్విట్టర్లో చేరిన ప్రిన్స్… తొలినాళ్ళల్లో అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అందులో భాగంగా అభిమానులు వేసిన ప్రశ్నలలో… నచ్చిన హీరోయిన్లు ఎవరు అని అడగగా… దానికి జవాబుగా ‘త్రిష అండ్ అనుష్క’ అంటూ ట్వీట్ చేసారు ప్రిన్స్.
ఇది జరిగి ఇప్పటికీ ఆరేళ్ళు పూర్తయిపోయింది. “ఖలేజా” సినిమా సెట్స్ పైన ఉన్న సమయంలో 2010, ఏప్రిల్ 27వ తేదీన ప్రిన్స్ ఈ ట్వీట్ చేసారు. అయితే దానికి ఇప్పుడు ఉబ్బితబ్బిబ్బైపోతోంది చెన్నై సోయగం త్రిష. నాటి మహేష్ ట్వీట్ ను ఉదహరిస్తూ… ‘దీనిని ఎలా మిస్సయ్యాను’ అంటూ త్రిష ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అప్పటికి మహేష్ తో ఎవరూ చేయని విధంగా రెండు సినిమాలు ‘అతడు, సైనికుడు’లలో నటించింది త్రిష.
How did i miss this #myfav https://t.co/Aa9yKKscub
— Trisha Krishnan (@trishtrashers) July 8, 2016



