ప్రత్యర్థిని దెబ్బ కొట్టడంతో పాటు తన పార్టీని ప్రజలలోకి తీసుకు వెళ్ళడానికి రాజకీయ పార్టీలు కొన్ని స్లొగన్స్ వాడుతుంటారు. అవి ఆపార్టీకి బలంగా మారి ఆ పార్టీ విజయానికి తనవంతు పాత్ర పోషిస్తాయి. 2024 లో టీడీపీ, జనసేన ఇచ్చిన ‘సైకో పోవాలి..సైకిల్ రావాలి’, ‘హలో ఏపీ బై బై వైసీపీ’ స్లోగన్స్ వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిచాయి.
2014 ఎన్నికల ప్రచారంలో ‘మీ భవిష్యత్ నా బాధ్యత’ అంటూ టీడీపీ ప్రజల నమ్మకాన్ని పొందితే, 2019 లో వైసీపీ తరుపున వైస్ షర్మిల ఇచ్చిన ‘బై బై బాబు’ అనే స్లోగన్ వైసీపీకి బలమయ్యింది. అలాగే ‘రావాలి జగన్ కావాలి జగన్’ స్లోగన్ కూడా ప్రజల నోళ్ళలో నానింది. అయితే అప్పుడు జగన్ కు బలమైన ఈ స్లోగన్స్ ఇప్పుడు జగన్ ను ట్రోల్ చెయ్యడానికి వాడుతున్నారు టీడీపీ నేతలు.
11 సీట్లతో ఊహించని ఓటమిని ఎదుర్కున్న జగన్ కనీసం ప్రతిపక్ష నేత హోదాను కూడా దక్కించుకోలేకపోవడంతో అసెంబ్లీకి డుమ్మా కొట్టి ఢిల్లీలో పంచాయితీ పెట్టారు. తన మీద ఉన్న కేసుల విచారణకు కోర్టులకు హాజరు కాకుండా సాకులు చెప్పుకోవడం, ప్రజలు తనకిచ్చిన బాధ్యత నెరవేర్చడానికి అసెంబ్లీకి రాకుండ కారణాలు వెతుక్కోవడంతో జగన్ ప్రజాస్వామ్యానికి ఎంత విలువనిస్తారో, చట్టాలను ఏమాత్రం గౌరవిస్తారో చెప్పడానికి ఇదే చక్కటి ఉదాహరణ అంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
అలాగే “అసెంబ్లీ కి రావాలి జగన్…కావాలి జగన్” అంటూ టీడీపీ నేతలు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆదిరెడ్డి శ్రీనివాస్ లు వైసీపీ స్లోగన్స్ తోనే ఒక రకంగా మీడియా సాక్షిగా జగన్ ను ర్యాగింగ్ చేశారనే చెప్పాలి. ‘వై నాట్ 175 ‘ అంటూ వైసీపీ రెచ్చిపోతే వై నాట్ 11 అంటూ ప్రజలు వైసీపీ గొంతు నొక్కారు అయినా వైసీపీ బుద్ది మారలేదు అంటూ రెచ్చిపోయారు టీడీపీ నేతలు.
అలాగే కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ‘శాంతి’ భద్రతలు కరువయ్యాయని జగన్ గగ్గోలు పెడుతున్నారు అసలు విజయ సాయి వల్లనే రాష్ట్రంలో ‘శాంతి’కి భద్రత కరువయ్యింది అంటూ కౌంటర్ వేశారు సుధీర్ రెడ్డి. గురివింద మాదిరి జగన్ తన పార్టీ నాయకుల కింద ఉన్న మచ్చను చూసుకోకుండా ఎదుటి వారి పై మచ్చలు వేయాలని ప్రయత్నిస్తున్నారు.
‘2024 ప్రతిపక్ష నేతగా జగనన్న వన్స్ మోర్’ అంటూ ప్రజలు తీర్పిస్తే అసెంబ్లీకి డుమ్మా కొట్టి
జగన్ ఆ తీర్పును అవమానిస్తున్నారు. కూటమి ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేత పత్రాలను చూస్తుంటే ‘గడప గడపకు’ వైసీపీ అవినీతి విస్తరించినట్లుగా కనపడుతుంది. ఈ అవినీతి కేసులన్నీ విచారణకు వెళితే జగన్ అండ్ కో జైలుకు వెళ్ళడానికి ‘సిద్ధం’ అయినట్లే.
జగన్ ను నమ్మి తమ రాజకీయ భవిష్యత్ ను పణంగా పెట్టడానికి “నువ్వే మా నమ్మకం జగనన్న” అంటూ జగన్ తో కలిసి నడవడానికి ముందడుగు వేసే నేతలెవరూ అనేది ఇక్కడ ప్రశ్నార్ధకం. ఉన్న 11 మందిని వెంటేసుకుని జగన్ ఐదేళ్లు కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచే సమయానికి ‘వై నాట్ పులివెందుల’ అనే పరిస్థితికి వైసీపీ పతనమైన ఆశ్చర్య పడనక్కరలేదు.
బాబు విడుదల చేసిన శ్వేత పత్రాలతో గడిచిన ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అవినీతి ‘అంతంత మాత్రం’ కాదనేది స్పష్టమయింది. నేడు వైసీపీ నేతల మీద వస్తున్న అవినీతి ఆరోపణలు, భూదందాల సెటిల్మెంట్ బాధితుల రోదనలు వింటుంటే జగన్ చెప్పినట్లుగా పెద్దిరెడ్డి, విజయ సాయి రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, భార్గవ్ రెడ్డి ‘మంచివాళ్ళు సౌమ్యులు’ కాదనేది తేటతెల్లమవుతుంది.




