కాంగ్రెస్ – టీడీపీది అపవిత్ర పొత్తు సరే … మరి మీరు గతంలో చేసిన సంసారం మాటేమిటి?

TRS Kalvakuntla Kavitha  comments on congress TDP TS allianceఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కోసమే ముందస్తుగా తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ జత కడుతోందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. అనైతిక పొత్తులకు టీడీపీ కేరాఫ్‌ అడ్రస్‌ అని ఎద్దెవా చేశారు. కాంగ్రెస్‌ నేతలపై ఉన్న కేసులు పాతవని, వాటితో మాకు ఎలాంటి సంబంధంలేదని ఆమె తేల్చిచెప్పారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సెంచరీ కొడతామని ధీమా వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

[m9ad]

ప్రతిపక్షాలు చేస్తున్న కక్ష సాధింపు ఆరోపణలలో ఏమాత్రం నిజం లేదని ఆవిడ చెప్పుకొచ్చారు. టీడీపీ – కాంగ్రెస్ అనైతిక పొత్తు గురించి ప్రజలకు వివరిస్తామని వాళ్లే వారికి బుద్ధి చెప్తారని కవిత చెప్పుకొచ్చారు. గతంలో కాంగ్రెస్ తో తెరాస పొత్తు పెట్టుకున్న మాటేమిటి? కేసీఆర్ కుటుంబ సమేతంగా సోనియా గాంధీని కలిసిన మాట వాస్తవం కాదా?

అదే రకంగా టీడీపీతో 2009లో మహాకూటమిగా ఉన్నమాట వాస్తవం కదా? తెరాస అన్ని పార్టీలతో కలవొచ్చు గాని మిగతా పార్టీలు కలవకూడదా? వారిది అపవిత్ర పొత్తు అయితే మరి అప్పట్లో తెరాస చేసినది ఏమిటి? ఇప్పుడు తెరాస వాళ్ళు చేస్తున్నవి అవకాశవాద ఆరోపణలు అనుకోవచ్ఛా?

ADVERTISEMENT
Latest Stories