రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తొలుత దూరంగా ఉండాలని భావించిన టీఆర్ఎస్ పార్టీ ఆఖరి నిమిషంలో ఎన్డీయే అభ్యర్ధికి ఓటు వేయడం సంచలనానికి దారి తీసింది. మొత్తానికి ఎన్డీయే అభ్యర్థి గెలుపొందారు. పెద్దల సభలో మోడీ ప్రభుత్వానికి మద్దత్తు ఇచ్చిన బీజేపీ లోక్ సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు.
అభివృద్ధి పనుల కోసం రక్షణ భూములు ఇవ్వాలని ఎంపీలు డిమాండ్ చేశారు. కర్ణాటక అడిగిన వెంటనే కేంద్రం రక్షణ భూములు కేటాయించిందని, ప్రధానిని కలిసి రక్షణభూములు ఇవ్వాలని కేసీఆర్ కోరినా పట్టించుకోలేదని ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు.
ఏపీకి అనుకూలంగా నిర్మలాసీతారామన్ వ్యవహరిస్తున్నారని ఎంపీ జితేందర్‌రెడ్డి ఆరోపించారు. మరి తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న మోడీ ప్రభుత్వానికి ఎందుకు మద్దత్తు తెలిపినట్టు? పొద్దున్న ఇచ్చిన మద్దత్తును కప్పి పుచ్చుకోవడానికి ఈ నిరసన కాదా? ఎవరిని మోసగించడానికి?



