రేవంత్ రెడ్డి తెరాసలో జాయిన్ కావడానికి ప్రయత్నించారట!

Talasani-Srinivas-Yadav comments on Revanth Reddy-కేసిఆర్ కుటుంబాన్ని గద్దె దించడమే తన జీవిత లక్ష్యం అని చెప్పి టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి చేరిన రేవంత్ రెడ్డి తెరాసలోకి చేరడానికి ప్రయత్నించి, కుదరక కాంగ్రెస్ లో చేరారా అంటే అవును అంటున్నారు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. దీనిపై తనతో సంప్రదింపులు చేశారని కూడా ఆయన అన్నారు

ADVERTISEMENT

కాని టిఆర్ఎస్ లో చోటు లేకపోవడంతో కాంగ్రెస్ లో చేరారని తలసాని ఆరోపించారు. తాను జిల్లా మంత్రులతో రేవంత్ గురించి మాట్లాడితే వాడు పెద్ద దొంగ, అలాంటోళ్లను తీసుకోవద్దు అని వారు అన్నరు. అందుకే రేవంత్‌కు టీఆర్‌ఎస్‌లో చోటు దక్కలేదు’’ అని తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు.

ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లినప్పుడు కొడంగల్‌ పౌరుషం ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. ఇది నిజామా లేక రేవంత్ ను ఇరుకున పెట్టె ప్రయత్నమా అనేది తెలీదు మరి. మరోవైపు రేవంత్ రెడ్డి ఇప్పటికి తన రాజీనామా లేఖ స్పీకర్ కు సమర్పించలేదు.

ADVERTISEMENT
Latest Stories