
జగన్ వచ్చినా.. ట్రంప్ వచ్చినా ప్రజలకు సమస్యలు తప్పవు.. అని ట్రంప్ మరోసారి నిరూపిస్తున్నారు. కానీ ఇద్దరికీ చిన్న తేడా ఏమిటంటే జగన్ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే నష్టపోతే, ట్రంప్ వలన యావత్ ప్రపంచదేశాలు నష్టపోతుంటాయి.
తాజాగా ఎఫ్-1 వీసాలపై వచ్చిన విదేశీ విద్యార్ధులు తాము చదువుకుంటున్న యూనివర్సిటీ క్యాంపస్ బయట పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయకుండా ఆంక్షలు కటినతరం చేశారు.
Also Read – ఈ పైరసీల ఫాంటసీ ఏంటో..? దీనికి వాక్సిన్ లేదా.?
విద్యార్ధులు సెలవులు, ఖాళీ సమయాలలో యూనివర్సిటీ క్యాంపస్‌లో మాత్రమే ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతి ఉంది. కానీ ఇంతకాలం యూనివర్సిటీలు, ప్రభుత్వం ఈ నిబంధనని పెద్దగా పట్టించుకోకపోవడం వలన విదేశీ విద్యార్ధులు, తమ చదువులు, హాస్టల్ ఫీజులు, ఇతర ఖర్చులకు చుట్టు పక్కల షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులలో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకునేవారు.
కానీ ట్రంప్ రాగానే బయట ఉద్యోగాలపై ఇప్పుడు విదేశీ విద్యార్ధులకు ఆ అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి బయట పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసేందుకు సిద్దపడినా పోలీసులకు పట్టుబడితే వారిని అరెస్ట్ చేసి చదువుల మద్యలోనే స్వదేశానికి తిప్పి పంపించేస్తారు.
Also Read – ప్రభుత్వంపై ఆధారపడమంటారు జగన్.. వద్దంటారు చంద్రబాబు!
అంతేకాదు… మళ్ళీ ఎన్నడూ అమెరికాలో అడుగుపెట్టకుండా నిషేధం విధించే అవకాశం కూడా ఉంది. కనుక విద్యార్ధులు ఎవరూ క్యాంపస్ బయట అడుగుపెట్టేందుకు సాహసించలేరు.
ప్రస్తుతం అమెరికాలో 3.30 లక్షల మంది భారతీయ విద్యార్ధులున్నారు. వారిలో సగానికిపైగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు.
Also Read – అల్లు వారి ఇంట మెగా వివాదాలు…!
ఇప్పుడు వారందరూ బయట పనిచేసి తమ ఫీజులు, హాస్టల్ ఖర్చులకు సంపాదించుకోలేరు. కనుక వారు అక్కడ చదువులు పూర్తిచేయాలంటే భారత్ నుంచి వారి తల్లి తండ్రులు తప్పనిసరిగా డబ్బు పంపాల్సి ఉంటుంది.
నిజానికి అమెరికాలో వారు చదువు పూర్తి చేసేందుకు తగిన ఆర్ధిక స్తోమతు ఉండాలనే షరతు ఎప్పటి నుంచో ఉంది. కానీ అమెరికాలో పార్ట్ టైమ్ ఉద్యోగాలతో సులువుగా డబ్బు సంపాదించుకునే వెసులుబాటు ఉన్నందున తగినంత ఆర్ధిక స్తోమతు లేకపోయినా తల్లి తండ్రులు తమ పిల్లలని ధైర్యంగా అమెరికా పంపిస్తున్నారు.
కానీ ఇప్పుడు బయట ఉద్యోగాలు చేసుకునే అవకాశం లేకపోవడంతో అప్పో సొప్పో చేసైనా పిల్లలకు డబ్బు పంపించక తప్పదు.
మరోపక్క అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ నానాటికీ పడిపోతోంది. అంటే మరింత ఎక్కువ డబ్బు పంపించాల్సి వస్తుందన్న మాట. ఇది విద్యార్ధులకు, వారి తల్లి తండ్రులకు ఎంత కష్టమో ఊహించుకోవచ్చు.
ట్రంప్ వస్తే సమస్యలు మొదలవుతాయని ఇదివరకే నిరూపించారు. మళ్ళీ మరోసారి నిరూపిస్తున్నారు అంతే! కానీ ఆయన తమ చట్టాలను నిఖచ్చిగా అమలుచేస్తున్నారే తప్ప ఎవరిపై కక్ష సాధించడం లేదు. కనుక ఆయనని తప్పు పట్టడానికి లేదు. మరి ఈ సమస్య నుంచి భారతీయ విద్యార్ధులు ఎప్పుడు, ఏవిదంగా విముక్తి లభిస్తుందో?