
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోటి దురుసుతనం, అహంకారం గురించి అందరికీ తెలిసిందే. అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మిత్ర దేశమైన భారత్‌తో సహా యూరోపియన్ దేశాలతో చాలా దురుసుగా వ్యవహరిస్తున్నారు.
ఆయన అమెరికా అధ్యక్షుడు అయితే కావచ్చు. కానీ మరో దేశానికి అధ్యక్షుడిని అవమానించే హక్కు, అధికారం రెండూ లేవు. అదీ తన ఇంటికి (వైట్ హౌస్)కి పిలిచి మీడియా ఎదుట అవమానించడాన్ని యావత్ ప్రపంచదేశాలు తప్పు పడుతున్నాయి.
Also Read – పాదయాత్రలా.. జైలా… ఏది బెస్ట్?
ఆయన ఆహ్వానం మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శుక్రవారం వైట్ హౌస్ వచ్చారు. మీడియా సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ఉపాద్యక్షుడు జేడి వాన్స్ కూడా పాల్గొన్నారు.
రష్యా చేత యుద్ధవిరమణ చేయించాలంటే అది తమ వల్లే సాధ్యమవుతుందని, అమెరికా కలుగజేసుకోకపోతే ఉక్రెయిన్ సర్వనాశనం అవుతుందని వారు హెచ్చరించారు.
Also Read – సుప్రీంకోర్టుకే కుచ్చు టోపీ పెడుతున్నారే!
“ప్రస్తుతం మీ వద్ద ఆయుధాలు, సైనికులు ఎవరూ లేరు అయినా శాంతి కోసం ప్రయత్నించకుండా ఇంకా యుద్ధం చేస్తామంటున్నారు. మీ వల్ల మీదేశ ప్రజలు నష్టపోతున్నారు. మీదేశానికి చెడ్డపేరు వస్తోంది. మేము (మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయంలో) 350 బిలియన్ డాలర్ల ఆర్ధికసాయం, ఆయుధాలు అందించి ఉండకపోతే వారం రోజులలోనే యుద్ధం ముగిసిపోయేది,” అని అన్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందిస్తూ “మాకు సాయపడినందుకు అమెరికాకు కృతజ్ఞతలు. రెండు రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇలాగే మాట్లాడారు. మా దేశంలో మేముంటున్నాము తప్ప ఎవరితో యుద్ధానికి వెళ్ళలేదు. రష్యాయే మా దేశంపై దాడులు చేస్తోంది. ప్రపంచమంతా చూస్తోంది” అని ఘాటుగా బదులిచ్చారు.
Also Read – రాజకీయాలలో ట్రైలర్లు.. సినిమాలు ఇక తప్పవు!
జెలెన్‌స్కీ ఆవిదంగా మాట్లాడటం ట్రంప్, జేడి వాన్స్ ఇద్దరికీ నచ్చలేదు. “వైట్ హౌస్‌కి వచ్చి అమెరికా అధ్యక్షుడు పట్ల ఈవిదంగా అవమానకరంగా మాట్లాడటం సరికాదు. మీ దురుసుతనాన్ని అమెరికా ప్రజలందరూ కళ్ళారా చూడాలనే మీడియా సమక్షంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నాము. మేము శాంతి నెలకొల్పడానికి దౌత్య ప్రయత్నాలు చేస్తుంటే మీరు ఇంకా యుద్ధం కొనసాగాలని కోరుకుంటున్నారు,” అని జేడి వాన్స్ వాదించారు.
రష్యాతో యుద్ధవిరమణ చేయించాలంటే ఇరు దేశాలతో మాట్లాడటం చాలా అవసరమే. కానీ దాని కోసం ఉక్రెయిన్‌లో అరుదైన ఖనిజాలు తవ్వుకునేందుకు అమెరికాని అనుమతించాలని కోరడమంటే చెయ్యి మెలిపెట్టి ఒప్పించే ప్రయత్నమే.
దానికీ జెలెన్‌స్కీ సిద్దపడ్డారు కానీ మళ్ళీ భవిష్యత్‌లో రష్యా ఎన్నడూ ఉక్రెయిన్ దేశంపై దాడి చేయకుండా అమెరికా హామీ ఇవ్వాలని, ఒకవేళ దాడి చేస్తే తమకు రక్షణ కల్పించాలని జెలెన్‌స్కీ కోరారు.
ఉక్రెయిన్ నుంచి అమూల్యమైన ఖనిజాలు తవ్వుకోవాలని అమెరికా ఆశిస్తున్నప్పుడు, అందుకు ప్రతిగా రష్యా నుంచి తమ దేశానికి భద్రత ఉంటుందని హామీ ఇవ్వాలని జెలెన్‌స్కీ కోరడం తప్పు కాదు.
కానీ ట్రంప్ ఏమన్నారంటే, “మీరు మాకు షరతులు విధించే పరిస్థితిలో లేరు. మేము చెప్పిన్నట్లే వినాలి. లేకుంటే మీరే నష్టపోతారు,” అని హెచ్చరించారు.
తమ దేశాధ్యక్షుడు పట్ల ట్రంప్ ఇంత చులకనగా మాట్లాడటం, అదీ.. యావత్ ప్రపంచం చూస్తున్నప్పుడు.. ఉక్రెయిన్ ప్రజలు జీర్ణించుకోగలరా?
సాటి దేశాధ్యక్షుడు తన ఇంటికి వచ్చినప్పుడు ఆయనతో ట్రంప్ గౌరవంగా వ్యవహరించాలి. ఇటువంటి సున్నితమైన విషయాలు ఏకాంతంగా మాట్లాడుకోవాలి.
కానీ జెలెన్‌స్కీ ఎటువంటివాడో అమెరికా ప్రజలందరూ చూడాలనే మీడియా సమక్షంలో ఈ సమావేశం ఏర్పాటు చేశామని ట్రంప్ చెప్పడం ఆయన అహంభావానికి అద్దం పడుతోంది కదా.
Zelensky has nerves of steel
Dream for Vishwaguru.pic.twitter.com/SiY6wBkOAS
— Amock_ (@Amockx2022) February 28, 2025