స్పాట్ ఫిక్సింగ్ : 2 బాల్స్… 2 లక్షల డాలర్లు..!

Umar Akmal match fixing వివాదాస్పద పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2015 ప్రపంచకప్ సందర్భంగా భారత్‌ తో జరిగిన మ్యాచ్‌ లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడాలని బుకీలు తనన సంప్రదించారని, వరుసగా రెండు బంతులు వదిలేస్తే 2 లక్షల డాలర్లు (1.36 కోట్ల) ఇస్తామని ఆఫర్ చేశారని సామా టీవీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

ADVERTISEMENT

అయితే తాను దేశం కోసం మాత్రమే ఆడతాని, ఇంకోసారి తన వద్ద ఇటువంటి ప్రతిపాదన తీసుకురావద్దని వారిని హెచ్చరించానని చెప్పుకొచ్చాడు. అక్మల్ చేసిన ఈ ఫిక్సింగ్ వ్యాఖ్యలను పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్రంగా పరిగణించింది. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో జూన్ 27న లాహోర్‌ లో యాంటి కరెప్షన్ యూనిట్ ఎదుట హాజరు కావాలంటూ నోటీసు పంపింది.

ఇంతకీ ఈ మ్యాచ్ లో ఏం జరిగిందంటే… ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ లో భారత్ 76 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ లో కోహ్లీ సెంచరీ (107)తో కదం తొక్కగా, అక్మల్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. ఇక కీపింగ్‌లో విరాట్ కోహ్లీ క్యాచ్‌ ను పట్టుకున్నాడు.

ADVERTISEMENT
Latest Stories