అమెరికా ప్రకటనతో పాక్‌ ఫినిష్…. ఇక చైనాయే దిక్కు!

Us Vice Prsident JD Vance on Indo -Pak Tensions

ఆపరేషన్ సింధూర్‌తో భారత్‌ ముందుగా తమ దేశంపై దాడి చేసింది కనుక అమెరికాతో సహా మిత్ర దేశాలు తమకి అండగా నిలబడి భారత్‌కు గడ్డి పెడతాయని పాక్‌ అనుకుంటే, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ఒకే ఒక ప్రకటనతో పాక్‌కు షాక్ ఇచ్చింది.

ఆయన ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ“అణ్వాయుధాలు కలిగిన భారత్‌-పాక్‌ మద్య జరుగుతున్న యుద్ధం చాలా ప్రమాదకరమైనది. కనుక ఇరు దేశాలు యుద్ధ విరమణ చేసి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కోరుతున్నాము. యుద్ధం ఆపేందుకు దౌత్యపరంగా ప్రయత్నిస్తాము. కానీ ఎట్టి పరిస్థితులలో ఈ యుద్ధంలో అమెరికా తల దూర్చదు,” అని అన్నారు.

ADVERTISEMENT

తద్వారా అమెరికా తన మిత్రదేశాలను కూడా ఈ యుద్ధానికి దూరంగా ఉండమని సూచించినట్లే. ముఖ్యంగా మీ అంతట మీరే ఆపుకునేందుకు ప్రయత్నాలు చేసుకోండి. కుదరకపోతే యుద్ధం చేసుకోండి. అమెరికా మాత్రం కలుగజేసుకోదని స్పష్టం చేసినట్లే. అమెరికా సహాయసహకారాలు లేకపోతే దాని మిత్రదేశాలు పాక్‌కు ఎటువంటి సాయం చేయవు.

రష్యా వంటి అత్యంత బలమైన, సంపన్న దేశమే ఉక్రెయిన్‌ వంటి చిన్న దేశంతో యుద్ధానికి దిగి ఆర్ధిక సమస్యలలో చిక్కుకొని బయటపడలేక తక్కువ ధరకు చమురు అమ్ముకొని ఆదాయం సమకూర్చుకోవలసి వచ్చింది. కానీ ఉగ్రవాదులు తప్ప మరేమీ లేని పాకిస్తాన్‌ ఈ యుద్ధాన్ని ఎలా భరించగలదు? విదేశీ సాయం లేకుండా ఎన్ని రోజులు కొనసాగించగలదు?అని ఆలోచిస్తే పాక్‌ పరిస్థితి అర్దమవుతుంది.

యుద్ధం మొదలుపెట్టిన మూడో రోజుకే పాక్‌ ఖజానా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు అమెరికా ‘రెడ్‌ సిగ్నల్’ వేయడంతో ముందుకు వెళ్ళలేక వెనక్కు తగ్గలేక దారుణంగా నష్టపోబోతోంది.

ఒకవేళ చైనా తన చేతికి మట్టి అంటకుండా భారత్‌ని దెబ్బతీసేందుకు ఇదో గొప్ప అవకాశంగా భావించి, పనిలో పనిగా తాము తయారుచేసిన ఆయుధాలను కూడా పరీక్షించుకోవాలని భావిస్తే కనుక పాకిస్థాన్‌కు డబ్బు, ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞాన సాయం అందించే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories