21 ఏళ్ళకే హార్ట్ ఎటాక్… బండారు కుమారుడు మరణం..!

vaishnav bandaru sonభారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఏకైక కుమారుడు 21 సంవత్సరాల వైష్ణవ్ గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు. మంగళవారం రాత్రి 10:45 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని ముషీరాబాద్‌లోని గురునానక్ కేర్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12:30 గంటలకు మృతి చెందాడు. వైష్ణవ్‌ ను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వైద్యులు తెలిపారు. వైష్ణవ్ ప్రస్తుతం ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో దత్తాత్రేయ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న పొలిటికల్ పెద్దలు దత్తాత్రేయను పరామర్శిస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories