వైసీపీ సిద్దాంతం ప్రకారం దాడులు చేస్తే సౌమ్యుడు….బూతులు తిడితే మంచివాడు. అయితే ఈ రెండు లక్షణాలను సంపూర్ణంగా కలిగి ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కొద్దీ నిముషాల కిందటే ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంటూ వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ మెప్పుకోసం టీడీపీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి ఘటనలో వల్లభనేని వంశీని A 71 గా చేర్చారు దర్యాప్తు అధికారులు. వల్లభనేని హైద్రాబాద్ పారిపోయారని, అమెరికా వెళ్ళడానికి సిద్ధమయ్యారు అంటూ వార్తలు ప్రచారంలో ఉండగా ఆయన స్వస్థలం గన్నవరం లోనే ఆయనను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
Also Read – ఐదేళ్ళ వైఫల్యం 100 రోజుల సమర్ధతని ప్రశ్నిస్తోంది!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో టీడీపీ మద్దతుదారులతో తీవ్ర ఆగ్రహావేశాలు నెలకొన్నాయి. తమ అధినాయకుడి భార్య నారా భువనేశ్వరి పై అన్యాయంగా నిందలు వేసి సభ్యసమాజం సిగ్గుపడేలా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచిన వంశీ మీద నాటి నుండి టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిరాగానే వల్లభనేని, కొడాలి వంటి వారి నోటిదూలకు తగిన శిక్ష పడాలి, పడుతుంది అని ఆశపడ్డ వారిలో టీడీపీ కార్యకర్తలే కాదు సామాన్య పౌరులు సైతం ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి తరుణంలో వంశీ అరెస్టు అంటూ వార్తలు రావడంతో అటు కూటమి పార్టీ నేతలతో పాటు సమాజ క్షేమం కాంక్షించే ప్రతి ఒక్కరు హర్షిస్తారు.
Also Read – ఫోన్ ట్యాపింగ్ కేసు అటకెక్కించేశారా?
అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులు చెయ్యడం, పదవులు అడ్డుపెట్టుకుని దుర్మార్గాలకు పాల్పడడం, అధికారులను అడ్డేసుకుని అవినీతి చేయడం వైసీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య లాంటిది. అయితే అటువంటి వారిని సౌమ్యులు, మంచివారు అంటూ వెనకేసుకొచ్చి నీతి ప్రవచనాలు వల్లించడం జగన్ కు గులకరాయి పట్టుకున్నంత తేలిక.
ఈవీఎం మిషన్ ను ధ్వంసం చేస్తూ, అక్కడ అడ్డుపడ్డ ఉన్న టీడీపీ ఏజెంట్ మీద దాడి చేస్తూ కెమెరా కళ్ళకు అడ్డంగా చిక్కిన పిన్నెల్లి వంటి నేతను సైతం జగన్ జైలుకెళ్లి పరామర్శించి పిన్నెల్లి చాల సౌమ్యుడు, మంచివాడు అంటూ సర్టిఫై చేసి టీడీపీ కక్ష్య పూరిత రాజకీయం చేస్తుంది అంటూ గగ్గోలు పెట్టారు.
Also Read – అయ్యో పాపం… వాలంటీర్లు!
ఇప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి ఘటనలో అరెస్టయ్యారు అంటున్న వల్లభనేని వంశీ విషయంలో కూడా జగన్ ఇదే మాదిరి స్క్రిప్ట్ కు సిద్దమై మీడియా ముందుకు వస్తే జగన్ సమాజం ముందు మరోసారి నవ్వులపాలు కావడం ఖాయంగా కనపడుతుంది. ఇటువంటి వారిని వెనకేసుకొస్తూ, వారికి అనుకూలంగా ప్రకటనలు చేస్తూ జగన్ వైసీపీ ని మరో మెట్టు దిగజారుస్తున్నారు.
అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని, ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుంది వల్లభనేని వంశీని కాదని ఆయన ముఖ్య అనుచరుడు యూసఫ్ పఠాన్ ను అని సమాచారం రావడంతో టీడీపీ శ్రేణులలో నైరాశ్యం అలుముకుంది. గత ప్రభుత్వంలో సోషల్ మీడియాలో మహిళలు మీద అసభ్యకర పోస్టులు పెట్టిన వైస్ భారతి పిఏ వర్రా రవీంద్ర రెడ్డి విషయంలో కూడా ఈ తరహా వార్తలే సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి.
అరెస్టు మీద నిర్దిష్ట సమాచారం లేకుండా మీడియాలో వార్తలు ప్రచారం చేసి టీడీపీ మద్దతుదారుల మనోభావాలతో ఆటలు ఆడుకుంటున్నారు అంటూ టీడీపీ శ్రేణులు ఇటువంటి అవాస్తవాల పై అసలేం జరుగుతుంది.? ఎం చెపుతున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.