గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువస్తున్నారు.
ఏడాది క్రితం ఆయన అనుచరులు గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసి, బయట పార్కింగ్ చేసి ఉన్న టీడీపీ నేతల వాహనాలకు నిప్పు పెట్టారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై ఎదురుకేసు పెట్టి జైల్లో పెట్టారు కూడా.
టీడీపీ కార్యాలయంపై దాడి చేసినందుకు కొన్ని నెలల క్రితం పోలీసులు కేసు వల్లభనేని వంశీతో సహా ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. వారిలో కొందరిని అరెస్ట్ చేశారు కూడా. కానీ వల్లభనేని వంశీ మాత్రం నేటి వరకు తప్పించుకు తిరుగుతూనే ఉన్నారు. ఆ కేసులోనే వంశీని అరెస్ట్ చేసిన్నట్లు సమాచారం.
కానీ ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీస్ కేసులకు, అరెస్టులకు భయపడటం లేదు. విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నందున జైల్లో ఇబ్బందిగా ఉంటుందని మాత్రమే వెనకడుగు వేస్తున్నారు.
అందుకే ముందస్తు బెయిల్ తీసుకుంటున్నారు. ఒకవేళ దొరక్కపోతే అరెస్ట్ అయిన వెంటనే బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చేస్తుంటారు. కనుక వల్లభనేని వంశీ విషయంలో కూడా ఇదే జరుగబోతోంది.
కానీ ఆయన అరెస్టు పేరుతో వైసీపీకి కాస్త కాలక్షేపం, రాజకీయ మైలేజ్ లభిస్తుంది. మరికొద్ది సేపటిలో వైసీపీ నేతలు కాఫీలు, టిఫినీలు కానిచ్చేసి మీడియా ముందుకు వచ్చేస్తారు. వంశీ అరెస్ట్ ఖండిస్తారు. చంద్రబాబు నాయుడు కక్షపూరిత రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తారు.
ఆలోగా ఇప్పటికే వారి సొంత మీడియా ఈ పని మొదలుపెట్టేసింది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలలో భాగంగా వల్లభనేని వంశీపై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేసిందని చెప్పేసింది. అక్రమ కేసులో అరెస్ట్ చేశారని చెపుతూనే, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ చేశారనే వాస్తవం కూడా చెప్పేసింది.
వల్లభనేని వంశీ అరెస్ట్ రాష్ట్ర రాజకీయాలలో సంచలనమైనదే కావచ్చు. కానీ ఇది జస్ట్ జైలు-బెయిలు స్టోరీ మాత్రమే. వారం రోజులు.. మహా అయితే నెల రెండు నెలలు.. అంతే ఆ తర్వాత వంశీ బయటకు వచ్చేస్తారు.
బయటకు రాగానే ఆయన స్వాతంత్ర్య సమర పోరాటయోధుడు అన్నట్లు వైసీపీ నేతలు పూలదండలు వేసి ఊరేగింపుగా తీసుకువెళతారు.
కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని హత్య చేసి అతని శవాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ ఆనంతబాబు బెయిల్‌పై బయటకు వస్తే బాజా బజంత్రీలతో ఊరేగింపుగా తీసుకువెళ్ళినప్పుడు, జగన్ కళ్ళలో ఆనందం కోసం టీడీపీ కార్యాలయాన్ని తగులబెట్టించిన వంశీకి ఏ స్థాయిలో ‘రిసీవింగ్ పార్టీ’ ఉంటుందో ఊహించుకోవాలి కానీ అరెస్ట్ అయ్యారనే వార్తని పెద్దగా పట్టించుకోనవసరం లేదు.
ఇదిలా ఉంటే, రాజకీయ విశ్లేషకులు ఈ అరెస్టును అధికారపార్టీ మరియు ప్రతిపక్షం మధ్య మరిన్ని ఉద్రిక్తతలను సృష్టించడానికి బాగా చిట్టచివరిగా భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టుల సంఖ్య పెరుగుతున్న సమయంలో, ఇలాంటి వ్యూహాలు రాజకీయ మార్పుల్ని తీసుకొచ్చేవా లేదా కేవలం గందరగోళం సృష్టించే వాడుకగా మారిపోతాయో అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైసీపీ మరియు టీడీపీ మధ్య కొనసాగుతున్న పోరాటం ఇంకో దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది, రెండు పక్షాలు ఇప్పుడు మరొకసారి ఉన్నత స్థాయి రాజకీయ నాటకం కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వంశీని వచ్చే వారాలలో ఎలా ప్రవర్తిస్తారు అనేది ఈ రాజకీయ సాగే దశను నిర్ణయించగలదు.




