vallabhaneni-vamsi-custody-extended

కుటుంబ పెద్ద సక్రమంగా ఉంటే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఆ కుటుంబం బాగుపడుతుంది. అలా కానప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడుతుంటుంది.

కుటుంబానికైనా, రాజకీయ పార్టీలకైనా ఇదే వర్తిస్తుంది. ఇందుకు ఉదాహరణగా టీడీపీ, వైసీపీలు మన కళ్లెదుటే ఉన్నాయి.

Also Read – అమరావతికి మరోసారి శంకుస్థాపన?

గత ఎన్నికలలో టీడీపీ ఓడిపోయి, జగన్‌ ప్రభుత్వం నుంచి ఎంతగా వేధింపులు ఎదురావుతున్నా చంద్రబాబు నాయుడు పార్టీ చెల్లాచెదురు అయిపోకుండా కాపాడుకుంటూ, ఎన్నికలలో పార్టీని గెలిపించుకుని మళ్ళీ అధికారంలోకి తెచ్చారు.

కానీ జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడూ అవినీతికి, అక్రమాలు, ఆరాచకాలకు పాల్పడుతూ తాను స్వయంగా జైలుకి వెళ్ళడమే కాకుండా తనతో ఉన్నవారందరినీ జైలుకి తీసుకువెళ్ళారు. ఇంకా వెళ్తూనే ఉన్నారు.

Also Read – ఆంధ్ర అంటే ఇంకా నామోషీయేనా కేటీఆర్‌జీ?

జగన్‌ అండ చూసుకొని రెచ్చిపోయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రులు జోగి రమేష్, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, వైసీపీ నేత దేవినేని అవినాష్ తదితరులు ఇందుకు తాజా నిదర్శనాలుగా కనిపిస్తున్నారు.

వంశీ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉండగా, మాజీ మంత్రులు జోగి రమేష్, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, వైసీపీ నేత దేవినేని అవినాష్, ఇంకా పలువురు అధికారులు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. ఎందువల్ల అంటే వారి కుటుంబ పెద్ద సరిగ్గా లేనందునే.

Also Read – ఏపీకి పెట్టుబడుల ప్రవాహం… చాలా అవసరమే!

“చిన్నప్పుడు తోటకూర దొంగిలించినప్పుడే మందలించి ఉంటే.. నాకు ఈ ఉరిశిక్ష పడేదా?” అంటూ ఓ కరడుగట్టిన నేరస్థుడు పరామర్శించడానికి వచ్చిన తల్లిని అడిగాడట!నిజమే కదా?

వైసీపీ నేతలు ఒకరి తర్వాత మరొకరు పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ళకి వెళుతుండటం చూస్తున్నప్పుడు, వైసీపీ అధినేత జగన్‌ తాను సక్రమంగా ఉంటూ, పార్టీలో అందరినీ క్రమశిక్షణలో పెట్టుకొని ఉంటే నేడు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు కదా? అని అనిపించకమానదు.

కానీ ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు కదా?కనుక జగన్‌తో పాటు వైసీపీ నేతలందరూ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయారు.

ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామనే గుడ్డి నమ్మకమే వారికి ఆ ధైర్యానిచ్చి ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదని జగన్‌తో సహా వైసీపీ నేతలందరికీ తెలియనిది కాదు. కనుక ఏం జరిగినా ఎదుర్కోగలమనే ధీమా వల్ల చెలరేగిపోయి ఉండొచ్చు.

వైసీపీ ఏర్పాటు చేయక ముందు నుంచి కూడా జగన్‌తో సహవాసం చేసినవారు లేదా ఆయన మార్గాన్ని అనుసరించినవారు లేదా ఆయన ఒత్తిడికి లొంగిన ప్రతీ ఒక్కరూ ఏదో కేసులో కోర్టు గడప ఎక్కకతప్పదని, జైలు పాలవక తప్పదని నాడు ఆక్రమాస్తుల కేసుల మొదలు నేడు టీడీపీ కార్యాలయంపై దాడి కేసు వరకు పదేపదే నిరూపితమవుతూనే ఉంది కదా?ఓ రాజకీయపార్టీ చరిత్ర, దానిలో నేతల పరిస్థితి ఈవిదంగా ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.. కదా?