
గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మూడు రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. కోర్టు సూచన ప్రకారం పోలీసులు ఆయనని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్ళి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత సబ్ జైలు అధికారులకు అప్పగించారు. అయితే మూడు రోజుల కస్టడీలో పోలీసులు ఈ కేసుకు సంబందించి వంశీ నుంచి ఒక్క సమాచారం కూడా రాబట్టలేకపోయారు. కనుక మరోసారి కస్టడీ కోరక తప్పదు.
కానీ పోలీసులు కస్టడీ కోరగానే వంశీ తరపు న్యాయవాదులు చాలా తెలివిగా ఆయనకు ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం వైద్య పరీక్షలు చేయించాలని పట్టుబట్టి కోర్టు ఆర్డర్ సాధించుకున్నారు.
Also Read – దువ్వాడకేనా డాక్టరేట్? మరి మిగిలినవారికో?
గతంలో రఘురామ కృష్ణరాజుని కస్టడీలోకి తీసుకొని ఏవిదంగా విచారణ జరిపారో వైసీపీ నేతలకంటే ఎవరికి బాగా తెలుసు? ఆ భయంతోనే రెండు పూటలా వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు ఆర్డర్ సంపాదించుకొని వంశీకి ముందుగానే రక్షణ కవచం తొడిగేశారు.
కనుక పోలీసులు వంశీని మరో నెలరోజులు కస్టడీలోకి తీసుకొని లాలించినా సమాధానాలు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఈలోగా వంశీ తరపున న్యాయవాదులు ఎలాగూ జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తారు. తిరస్కరిస్తే హైకోర్టులో వేస్తారు. అక్కడా తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకి వెళతారు. కనుక ఏదో రోజు వంశీ బెయిల్‌పై బయటకు వచ్చేయడం ఖాయమే. కాకపోతే నాలుగు రోజులు అటూ ఇటూ అంతే!
Also Read – సోము ‘శీల’ పరీక్ష కు సిద్దపడుతున్నారా.?
మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు, పేర్ని గోదాములలో రేషన్ బియ్యం మాయం కేసు, పోర్టు కబ్జా కేసు, పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా కేసుల జాబితాలో ఈ కిడ్నాప్ కేసు కూడా చేరిపోతుందేమో?