బుల్లితెర నటి భర్త ఆత్మహత్య!

Vamsam tv actress Nandhini husband Karthikeyan suicide‘మైనా’ అనే కార్యక్రమంలో తమిళ బుల్లితెరపై పాపులర్ అయిన నటిమణి నందిని భర్త కార్తికేయన్ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చెన్నైలో జిమ్ నిర్వహిస్తున్న కార్తికేయన్ కు గతంలోనే వివాహం అయ్యింది. అయితే భార్య చనిపోవడంతో ఎనిమిది నెలల క్రితం మదురైలో నటి నందినిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో, కొన్నాళ్లుగా విడివిడిగా ఉంటున్నారు.

ADVERTISEMENT

ఆర్థిక ఇబ్బందుల కారణంగా కార్తికేయన్ నిర్వహిస్తోన్న జిమ్ కూడా మూతపడింది. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన కార్తికేయన్, సోమవారం నాడు విరుగంబక్కంలోని ఓ లాడ్జిలో కూల్ డ్రింక్స్ లో విషం కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వీరిద్దరి మధ్య నందిని తండ్రి వలనే విభేదాలు తలెత్తినట్లుగా ప్రాధమికంగా లభించిన సమాచారం.

ADVERTISEMENT
Latest Stories