న్యూ ఇయర్ గిఫ్ట్ : ఏపీ సర్కార్ మరో బాదుడు!

Minister Perni Naniపేదల కోసమే తమ ప్రభుత్వం అంటున్న ‘వైసీపీ అండ్ కో’ పేదలను మరింత నిరుపేదలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలకు ప్రతి రోజు ఓ కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లుగా కనపడుతోంది. రోజుకొక కొత్త పధకంతో ప్రజల నుండి పన్నుల రూపంలో రాబడుతోన్న జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం, నూతన సంవత్సర కానుకగా మరో బాదుడుకు శ్రీకారం చుట్టింది.

ADVERTISEMENT

2002, జనవరి 1వ తేదీ నుండి వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజును ఏపీ సర్కార్ పెంచనుంది. దీంతో తక్కువ ఫీజుతో బయటపడదామని ప్రయత్నించిన ఏపీ ప్రజలకు రవాణా శాఖా వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో వాహనాల రిజిస్ట్రేషన్స్ ఆగిపోయాయి. ఈ దిశగా మంత్రి పేర్ని నాని ఓ ప్రకటన కూడా చేసారు. రవాణా శాఖా వెబ్ సైట్ లో సాంకేతిక సమస్య తలెత్తిందని, సాఫ్ట్ వేర్ ను సరిచేసే పనిలో ఇంజినీర్లు ఉన్నారని చెప్పారు.

సరిగ్గా ఏపీ సర్కార్ చార్జీలను ఒక రోజులో పెంచుతుందనంగా, ఇలా సాఫ్ట్ వేర్ లో సమస్యలు తలెత్తడం ఏమిటో ఏపీ ప్రజలకు అర్ధం కావడం లేదు. సాఫ్ట్ వేర్ లోపం గనుక జనాలతో పాటు మంత్రి గారికి తెలిసి ఉండకపోవచ్చు గానీ, కొత్త ఏడాదిలో ఏపీ ప్రజల నెత్తిన మరో గుదిబండ కూర్చోవడం ఖాయం. అయితే పేర్ని నాని ఇచ్చిన ఈ సాంకేతిక సమస్యలపై నెటిజన్లు ఏపీ సర్కార్ పై కామెంట్స్ చేస్తున్నారు.

ఒక రోజు గడిస్తే పెంచిన చార్జీలు అమలవుతాయి గనుక, ఈ ఏడాది చివరి రోజు కూడా రవాణా శాఖా వెబ్ సైట్ పనిచేయదని, ఒకటో తేదీ నుండి ఎలాంటి సాంకేతిక సమస్య లేకుండా పని చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇంటర్నెట్ ప్రియులు మరీ అలా కామెంట్ చేస్తారు గానీ, రేపు చార్జీలు పెరుగుతున్నాయని కంప్యూటర్స్ కు తెలిసి ఈ రోజు ఆగిపోతాయా ఏమిటి? మరీ విడ్డూరం కాకపోతేనూ!? ఏదో అలా జరిగిపోతుంది అంతే!

ADVERTISEMENT
Latest Stories