venu-swamy-pooja-in-allu-arjun-issue

ఇప్పటి వరకు బన్నీ, పుష్ప మూవీ వివాదాన్ని రాజకీయం చేసి దానిని తమ రాజకీయ లబ్ది కోసం వినియోగించుకోవాలని ఇటు ఏపీలో వైసీపీ, అటు తెలంగాణలో బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటీ పడిన వైనాన్ని గమనించాం. ఇప్పుడు ఈ వివాదంలోకి సెలబ్రెటీల జాతకాలను తన దివ్య దృష్టితో చెప్పగలిగే వేణు స్వామి వచ్చారు.

సంధ్యా థియేటర్ లో జరిగిన ఒక అనుకోని ఘటనను ఎవరికీ నచ్చిన తీరులో వారు ప్రచారం చేసుకుంటూ తమ మైలేజ్ ను పెంచుకునే పనిలో ఉన్నారు. అయితే సినీ సెలబ్రెటీల జీవితాల మీద జాతకాల పేరుతో ఎప్పుడు నెగటివ్ కామెంట్స్(వివాదాస్పద వ్యాఖ్యలు) చేస్తూ మీడియాలో హడావుడి చేసే వేణు స్వామి అల్లు అర్జున్ వివాదంలో కూడా వేలు పెట్టారు.

Also Read – జగన్‌ కేసులు: ఉపాధి హామీ పదకాలే.. కొనసాగితేనే బెటర్!

అల్లు అర్జున్ జాతకం ప్రకారం ఇప్పుడు బన్నీ టైం అసలు బాగోలేదని, వచ్చే ఏడాది 2025 మార్చ్ 28 నాటికీ అంతా చక్కబడి అల్లు అర్జున్ జీవితంలో అంతా మంచి జరుగుతుందంటూ మరోసారి తన జోతిష్య పటిమను బయటకు తీశారు. అలాగే తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి 2 లక్షల రూపాయిల ఆర్ధిక సాయం అందించారు.

దానికి తోడు తొక్కిసలాట ఘటనలో అపస్మారక స్థితిలో ఉంటూ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీ తేజ్ ఆరోగ్యం మెరుగుపడడనికి గాను తన వంతుగా శ్రీ తేజ్ పేరు మీదగా మృత్యుంజయ హోమం చేస్తున్నట్లు ప్రకటించారు.

Also Read – ఒకరిది ‘గురు శిష్యుల’ బంధం…మరొకరిది ‘అన్నదమ్ముల’ స్నేహం.!


అయితే తనను సినీ పరిశ్రమ పెద్దలు అకారణంగా అవమానించిన కారణంగానే టాలీవుడ్ ప్రముఖులు ఇప్పుడు వివాదాలలో ఇరుక్కుంటున్నారని చెపుతూ బన్నీ, మోహన్ బాబు ఉదంతాలను ప్రస్తావించి తనను తానూ ఒక అతీత శక్తిగా చెప్పుకున్న వేణు ఇప్పుడు ఇలా బాధిత కుటుంబానికి అండగా నిలబడడం నిజంగా హర్షించదగ్గ పరిణామమే.