tdp-janasena-ysrcp

ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సరళిని ఇటు వైసీపి అటు కూటమి రెండూ కూడా తమకు అనుకూలంగా అన్వయించుకొని మేమే గెలువబోతున్నామని చెప్పుకుంటున్నాయి. ఇది సహజమే. జగన్మోహన్‌ రెడ్డి “మండుటెండలు లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను,” అని ట్వీట్‌ చేశారు.

Also Read – మేమూ డైరీలు రాసుకుంటున్నామోచ్!

కానీ రాష్ట్ర వ్యాప్తంగా ‘మౌత్ టాక్’ మాత్రం ‘ఈసారి కూటమే’ అని వినిపించింది. ఈసారి ఎన్నికలలో ఓట్లు వేసేందుకు దేశ విదేశాల నుంచి రావడం చూసినా ‘మార్పు’ కోసమే అని స్పష్టం అవుతోంది. చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ ఎన్నికలలో గెలవడం గురించి కాక మెజార్టీ గురించి మాట్లాడుతుండటం గమనిస్తే కూటమి విజయం ఖాయమని అర్దమవుతోంది.

ఇదే సమయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి రోజా ఇంకా పలువురు వైసీపి సీనియర్ నేతలు కూటమిని, ఎన్నికల సంఘాన్ని నిందిస్తూ మాట్లాడుతున్న మాటలు ఓడిపోతున్నామనే ఆందోళనతోనే అని అర్దమవుతుంది.

Also Read – నాగార్జున కేసు మూడు రోజులలో… మరి జగన్‌ కేసులో?

ఒకవేళ వైసీపి గెలుపు ఖాయం అని నమ్మకం కలిగి ఉంటే మంత్రులు అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాధ్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, అనిల్ కుమార్‌ యాదవ్‌ వంటివారు మీడియా ముందుకు వచ్చి చాలా హడావుడి చేసేవారు. కానీ అందరూ సైలంట్ అయిపోయారు.

టిడిపి, జనసేన సోషల్ మీడియాలో ఎన్ని సీట్లు, ఎంత మెజార్టీ అని లెక్కలు వేసుకుంటుండగా, వైసీపి సోషల్ మీడియాలో సైలంట్ అయిపోవడం గమనిస్తే ఓటమి ఖాయమని వైసీపికి అర్దమైపోయిన్నట్లే ఉందనిపిస్తుంది.

Also Read – స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్..!

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌ ‘మహా న్యూస్’లో ‘వైబ్రాంట్ ఇండియా’ అనే సర్వే సంస్థ నివేదికని వెల్లడించింది. ఆ సంస్థ ఇప్పటి వరకు 14 ఎన్నికలు సర్వేలు చేసి తమ అంచనాలు ప్రకటించగా వాటిలో 12 ఫలించాయని మహాన్యూస్ ఛైర్మన్‌ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌ మారెళ్ల వంశీకృష్ణ తెలియజేశారు.

‘వైబ్రాంట్ ఇండియా’ సంస్థ అనేక అంశాల ఆధారంగా సమాజంలో వివిద వర్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈసారి ఏపీ శాసనసభ ఎన్నికలలో కూటమి ఖచ్చితంగా 79 సీట్లు గెలుచుకుంటుందని, మరో 20 సీట్లలో ఆధిక్యత సాధించే అవకాశం ఉందని, మొత్తం 115-120 సీట్లు సాధించవచ్చని తెలియజేసింది.

ఇక వైసీపి ఖచ్చితంగా గెలుచుకునే సీట్లు 29, ఆధిక్యత సాధించగలవి మరో 18 కలిపి మొత్తం 55-60 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించిందని మారెళ్ల వంశీకృష్ణ తెలిపారు.

‘వైబ్రాంట్ ఇండియా’ నియోజకవర్గాల వారీగా కూడా ఏ పార్టీ పరిస్థితి ఏవిదంగా ఉందో తెలియజేసింది. ఆ నివేదికని మహాన్యూస్ ఛైర్మన్‌ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌ మారెళ్ల వంశీకృష్ణ స్వయంగా వివరించారు.