ఎన్నికల అంతిమ లక్ష్యం గెలుపే అనుకున్న వారికి విజయ్ పరిస్థితి కనువిప్పుగా మారింది. ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపు ముగింపు కాదని, మెజారిటీ మాత్రమే ముగింపు అవుతుందని రుజువు చేసాయి తమిళ రాజకీయాలు. 234 నియోజకవర్గాల పోటీలో మ్యాజిక్ ఫిగర్ 118 కాగా అందులో విజయ్ టీవీకే 108 స్థానాలలో విజయం సాధించింది.
దీనితో మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన ఆ 10 స్థానాలను విజయ్ సునాయాసంగా దక్కించుకుంటారు అనుకున్న వారికీ పెద్ద షాక్ ఇచ్చాయి తమిళ రాజకీయ పార్టీలు. ఆ 10 లో కూడా కాంగ్రెస్ 5 స్థానాలకు మద్దతు ప్రకటించింది. ఇక ఆ మిగిలిన 5 స్థానాల బలం కోసం విజయ్ గత ఐదు రోజులుగా ముఖ్యమంత్రి పీఠం కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే ఎట్టకేలకు విజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో ఇక గెలుపుతో మొదలైన రాజకీయ చదరంగం మెజారిటీ తో ముగుస్తోందా అన్న చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు మెజారిటీ కి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యే ల సంతకాలతో విజయ్ వస్తే టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు స్వాగతిస్తా అంటూ ఖరాకండిగా చెప్పిన తమిళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్,
ఇప్పుడు విజయ్ తన మిత్రపక్షాలతో కలిపి సుమారు 120 మంది ఎమ్మెల్యే ల బలంతో లోకభవన్ కు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. రాజేంద్ర కేరళం గవర్నర్ గా కూడా వ్యవహరించడంతో ఆయన తన ముందస్తు అపాయింట్మెంట్స్ ప్రకారం కేరళం వెళుతున్నట్టు చెప్పిన లోకభవన్ విజయ్ ను నిరాశతో వెనక్కి పంపింది.
గంటకో ట్విస్ట్, పూటకో అనిచ్చితి అన్నట్టుగా సాగుతున్న తమిళ అధికార పీఠం ఆట ఏనాటికి ముగుస్తుందో.? విజయ్ అనే నేను అనే కల విజయ్ కి విజయ్ అభిమానులకు ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి. అయితే విజయ్ టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం పక్కా, అయితే ఆ సమయం ఎప్పుడు అనేదే ఇక్కడి ప్రశ్న.




