వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, జగన్ దుర్మార్గాలు చెప్పుకుంటూ పొతే వాటికీ ఒక మహా సముద్రం మాదిరి ఎండ్ కార్డు వేయలేము. ఒక్క ఛాన్స్ అంటూ వేడుకున్న జగన్ ఆ వచ్చిన ఒక్క ఛాన్స్ తో ఎంతోమందిని వేధించారు. అందులో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ కూడా ఒక బాధితుడే.
Also Read – మంచులో అందరూ మంచివాళ్ళే కానీ…
2019 నర్సాపురం వైసీపీ పార్టీ ఎంపీ గా ఉన్న గెలిచిన రఘురామా కృష్ణ రాజు జగన్ నిర్ణయాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో కక్ష్య రాజకీయాలకు తెరలేపిన జగన్ తన అధికారంతో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ఆయనను అరెస్టు చేసి చిత్ర హింసలకు గురిచేసిన విషయం తెలిసిందే. అయితే నాటి నుంచి నేటి వరకు తనకు జరిగిన అన్యాయం పై న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు RRR.
అన్యాయంగా తనను వేధించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, ఈ దారుణానికి ఊతమిచ్చిన తెరవెనుక ఉన్న ఆ పెద్ద తలకాయల గుట్టు బయటపెట్టాలని రాజు గారు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఆయన న్యాయపోరాటానికి ఫలితం దక్కనుంది అనేలా పరిస్థితులు RRR కు అనుకూలంగా మారుతున్నాయి.
Also Read – విదేశాలకు రేషన్ బియ్యం రవాణా ఏవిదంగా అంటే..
గత ఐదేళ్లల్లో ఎంపీ నుంచి డిప్యూటీ స్పీకర్ గా ఎదిగిన RRR నిజాయితీగా, చాల బలంగా తన వాదన వినిపించారు. అప్పుడు తనను వేధించిన వీడియోలు చూసి ఆనందించినవారు ఇప్పుడు తన ముందుకు రావడానికి కూడా భయపడుతున్నారు అంటూ తనదైన స్టైల్ లో వైసీపీ కి గట్టి కౌంటర్లే ఇస్తున్నారు.
అయితే రాజు గారి కేసు విచారణకు తీసుకున్న అధికారులు కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రఘురామను చంపేందుకు ప్రయత్నాలు జరిగాయని జాయింట్ డైరెక్టర్ వి. రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. దీని ఫలితమే ఆయన సీఐడీ ఆఫీస్ లోపలి నుంచి బయటకు నడవలేని స్థితిలో వచ్చారని, అలాగే RRR ను వేధించిన వీడియోలను వైసీపీ పెద్దలకు విచారణాధికారి విజయ్ పాల్ చేరవేశారని పేర్కొన్నారు.
Also Read – జగన్ మీద ప్రేమా.? బాబు మీద ద్వేషమా.?
అలాగే రఘురామ మీద జరిగిన దాడిని ఖండించే విధంగా కోర్టుకు నివేదికలు అందించిన జీజీహెచ్ డాక్టర్లు కూడా ఈ కేసులో నిందితులే అంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ కుట్ర మొత్తాన్ని తెరముందు ఒక ప్రణాళిక ప్రకారం అమలు చేసిన సిఐడి మాజీ ఎఎస్పీ విజయ్ పాల్ కు కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే పోలీసులు విజయ్ పాల్ ను తమ కస్టడీకి అప్పగించాలంటూ న్యాయస్థానాన్ని కోరారు.
అయితే కూటమి ప్రభుత్వంలో అరెస్టులు చేయడానికి ఒక సినిమా తీసినంతా సమయం తీసుకుంటుంటే బైలు మాత్రం పైరసి ప్రింట్ మాదిరి యిట్టె ప్రత్యక్షమవుతుంది. మరి విజయ పాల్ చేసిన అరాచకానికి, చేయించిన వారి పైశాచికత్వానికి శిక్షలు పడతాయా.? లేక ఇది కూడా ఒక నామమాత్రపు అరెస్టు మాదిరి RRR కి కంటి తుడుపు చర్యలా మారుతుందా.?
అయితే ఎవరి ప్రోద్భలంతో విజయ్ పాల్ ఈ దారుణానికి ఒడిగట్టారో ఇప్పుడు వారు విజయ్ పాల్ ను జైలు పాలుకాకుండా ఆపగలిగారా.? రేపు విచారణ పూర్తి చేసుకున్న నాడు సాక్ష్యాలు పాల్ కు వ్యతిరేకంగా ఉంటే న్యాయస్థానాలు ఆయనకు విధించే శిక్షలను తెరవెనుక ఉన్న ఆ పెద్ద మనుషులు ఆపగలుగుతారా.?
ఇప్పటికే జగన్ ను నమ్మి వారి స్థాయికి మించి అక్రమాలు, అరాచకాలు చేసిన వారంతా ఇప్పుడు తమ అరెస్టు పై జగన్ మౌనంగా ఉండడంతో తూర్పుకి తిరిగి దండం పెడుతున్నారు. ఇక పాల్ కూడా అదే దిక్కుని ఎంచుకుని దండం పెట్టాల్సిందేనా.?