
అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడడం, ప్రతిపక్షంలోకి రాగానే ఆ అవినీతి నుంచి తప్పించుకోవడానికి రాజీనామాలు, రాజీలు అంటూ పక్క దారులు వెతుక్కోవడం రాజకీయ నాయకులకు పరిపాటిగా మారిపోయింది.
అయితే తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి విజయ సాయి రెడ్డి రాజీనామా చేయడంతో రాజీనామాలతో ప్రభుత్వాలు రాజీ పడతాయా అనే ప్రశ్న సామాన్యుడిలో ఉత్పన్నమయ్యింది. గత ఐదేళ్ల సాయి అవినీతికి, జగన్ పదిహేనేళ్ల అక్రమాలకు సజీవ సాక్షిగా నిలిచిన విజయ సాయి తన రాజకీయ పాపాల నుంచి అధికారం అనే అవినీతి నుంచి తప్పించుకోవడానికే ఈ రాజీనామా వ్యూహాన్ని తెరమీదకు తెచ్చారా అనే సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి.
Also Read – ఈ ఐదేళ్ల వడ్డీ కాదు గత ఐదేళ్ల వడ్డీ సంగతేంటి.?
రాజ్యసభకు రాజీనామా చేస్తేనో, రాజకీయాలకు రిటైర్ మెంట్ ప్రకటిస్తేనో, రాజకీయ వేదికలకు దూరంగా ఉంటేనో ప్రభుత్వాలు, వ్యవస్థలు వారి అవినీతి పాపాలను, అక్రమాల పొద్దును ఉపేక్షిస్తాయా.? గత ఐదేళ్ల విజయ సాయి రెడ్డి విశాఖ భూ దందాలే కొన్ని వేల కోట్ల అవినీతికి సాక్ష్యాలు. ఈ ఒక్క రాజీనామా నిర్ణయం ఆ అన్నిటికి రాజీ మార్గమవుతుందా.?
గత ఐదేళ్ల అధికార అహంతో విజయ సాయి రెడ్డి చేసిన ప్రతి చర్యకు ఈ రాజీనామా జవాబు చెప్పగలదా.? అలాగే సాయి మీద ఉన్న అక్రమ కేసులన్నీ ఈ రిటైర్ మెంట్ తో గాంధీ గారి ఖాతాలో పడినట్టేనా.? ఇలా అధికారంలో ఉన్న ఐదేళ్లు నోటికి వచ్చిందల్లా వాగుతూ, కంటికి నచ్చిందల్లా కాజేస్తూ, చేతికి అందిందంతా దోచేస్తూ ఆ తరువాత వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటిస్తే చేసిన పాపాలు కేసులుగా మారి వెంటాడవా.?
Also Read – ఢిల్లీ బీజేపి ఊడ్చేస్తే తెలంగాణలో కళ్ళాపి తప్పదేమో?
వైసీపీ నేతల ఆలోచన సరళి చూస్తుంటే ఇదే వాస్తవం అనిపించక మానదు. కొడాలి నాని, పేర్ని నాని, అంబటి, రోజా, వల్లభనేని వంశీ వంటి వైసీపీ నాయకులు, శ్రీరెడ్డి, పోసాని, ఆర్జీవీ వంటి వైకాపా అరాచక శక్తులు అద్దులు దాటి ప్రవర్తించారు, హద్దులు దాటి రాజకీయాలు చేసారు.
కానీ వైసీపీ పార్టీ ఘోర ఓటమితో ఒక్కసారిగా సుద్ద పూస కబుర్లు చూపు ఒకరు, చేసిన పాపాలకు క్షమాపణలు కోరుతూ మరొకరు, రాజకీయాలకు దూరం అంటూ ప్రకటనలు చేస్తూ మరొకరు, మౌనంగా అజ్ఞాతములో జీవిస్తూ ఇంకొందరు, ఇప్పుడు రాజకీయ రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఈ పెద్దాయన ఇలా ఈ సో కాల్డ్ వైసీపీ మూకలంతా కూడా వారి చర్యలకు ప్రభుత్వాల నుండి ప్రతి చర్య లేకుండా ఇలా రాజీ మంత్రాలు మొదలుపెట్టారనిపిస్తుంది.