Vijaysai Reddy

వైసీపీ అధినాయకుడి నుండి కింద స్థాయి నాయకుల వరకు వైసీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఓ వర్గం మీడియాను టార్గెట్ చేస్తూ నిత్యం విమర్శలు చేసుంటారు. అయితే వీరు చేసే విమర్శలను ఒక్కసారి నిశితంగా పరిశీలిస్తే వైసీపీ నాయకులందరూ ఆ వర్గం మీడియాను చూసి భయపడుతున్నట్టో లేక ఆ వర్గం మీడియాను భయపెట్టాలని చూస్తున్నట్టో అనిపిస్తుంది.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో, ఒక పత్రికాధిపతిగా, ఒక ఛానల్ అధినేతగా ఉంటూ కూడా పదేపదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 పైన యల్లో మీడియా ముద్రేసి దుష్టచతుష్టయం అంటూ సదరు మీడియా అధిపతులను భయపెట్టాలని ప్రయత్నించారు.

Also Read – వింటేజ్ విరాట్…!

అధికారంలో ఉంది మేమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేస్తే చూస్తూ ఉరుకోము అంటూ బెదించడం, బాబును ముఖ్యమంత్రిని చేయడానికి యల్లో మీడియా వైసీపీ ప్రభుత్వం పై బురద జల్లడానికి ప్రయత్నిస్తుంది వారి తప్పుడు వార్తలను నమ్మొద్దు అంటూ భయపడుతూ ఐదేళ్ల సమయాన్ని మీడియా స్వేచ్ఛను హరించడం మీదే వెచ్చించారు జగన్.

అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా సమయంలోనే వైసీపీ నియంతృత్వం పై అలుపెరుగని పోరాటం చేసాయి సదరు మీడియా సంస్థలు. ఇప్పుడు వైసీపీ పార్టీకి అధికారంతో పాటు ప్రతిపక్ష హోదా కూడా పోయింది. అయినా వైసీపీ నాయకుల అహం కానీ అహంకారం తగ్గలేదు. ముఖ్యంగా తమకు వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేసే మీడియాలను అణిచి వేయాలి అనే ఆలోచన ధోరణి నుంచి వైసీపీ బయటపడలేకపోయుంది.

Also Read – నమ్మలేం దొరా…!

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు అసలే ఘోర ఓటమి అవమానం తో తలెత్తలేక ఇబ్బంది పడుతున్న వైసీపీ పార్టీకి ఇప్పుడు విజయసాయి రెడ్డి వివాదం మరో కొత్త తల నొప్పిని తెచ్చిపెట్టింది. సాయి మీద వచ్చిన ఆరోపణలను సమర్ధించలేక ఖండించలేక వైసీపీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు.

దీనికి తోడు సొంత పార్టీ నేతలే విజయ సాయి మీద ఉన్న ద్వేషంతో ఈ విషయాన్ని సమాజం ముందుకు తెచ్చారు అనే పుకార్లు కూడా ఊపందుకున్నాయి. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు విజయసాయి సొంత పార్టీ నేతల మీద ఉన్న కోపాన్ని మీడియా మీదకు మళ్ళించారా అన్నట్లుగా కొన్ని మీడియా ఛానెల్స్ అధిపతులను అందులో పని చేస్తున్న ముఖ్యమైన వ్యక్తుల మీద సాయి రెడ్డి రెచ్చిపోయారు.

Also Read – రివ్యూల దీపం ఆర్పేస్తే, సినిమా అంధకారంలో మునిగిపోతుంది.

తన మీద వచ్చిన ఆరోపణలతో మీడియా ముందుకొచ్చిన సాయి మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తన సహనాన్ని విడిచి పెట్టి విలేకరులను మొదలుకుని ఆ ఛానెల్ అధిపతుల వరకు వాడు వీడు అంటూ నోరుజారారు. ప్రతిపక్షంలో ఉన్నాడు వీడేం చేస్తాడులే అనుకుంటున్న మహా న్యూస్ వంశీ కృష్ణ గాడిని, ABN రాధా కృష్ణ గాడిని, వెంకట కృష్ణ గాడిని, టీవీ 5 సాంబడు గాడిని అంటూ జర్నలిస్టుల పై తన ప్రతాపాన్ని చూపించారు సాయి.

ఇక్కడ విజయ సాయి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే సాయి రెడ్డి మీద ఈ విధమైన ఆరోపణలు చేసింది మీడియా కాదు, ఒక ప్రజాప్రతినిధిగా (ఎంపీ) రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విజయసాయి మీద వచ్చిన ఆరోపణలను మీడియా ప్రచారం మత్రమే చేసింది. వార్తను సృష్టించలేదు. బాధితుడు సాక్ష్యాధారాలతో మీడియా ముందుకు వచ్చినప్పుడు అతని వైపు వాదన కూడా ప్రజలకు వినిపించాల్సిన బాధ్యత మీడియా మీద ఉంటుంది.

ఇప్పుడు సాయి రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. సాక్షి ఛానెల్స్ మాదిరి బాబాయ్ గొడ్డలి వేటును గుండె పోటుగా చిత్రీకరించి గాలి వార్తలను ప్రచారం చెయ్యలేదు సదరు ఛానెల్స్. రాజకీయాలలోకి వచ్చిన వ్యక్తులకు వ్యక్తిగత జీవితం రాజకీయ జీవితం అంటూ రెండు వేరు వేరుగా ఉండవని, ఏదైనా ప్రజల ముందు చర్చించడానికి సందేహించవలసిన అవసరం లేదని పవన్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన పదేపదే మీడియాలో చర్చికు ఉంచుతారు వైసీపీ నేతలు.

మరి ఇప్పుడు సాయి రెడ్డి మాత్రం తనకు ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలంటూ లేదంటే వార్తలను ప్రచారం చేసిన ఛానల్స్ పై పరువు నష్టం కేసు వేస్తానని, అవసరమైతే చట్ట సభలలో ఈ విషయం పై చర్చించి చట్టపరంగా చర్యలు తీసుకుంటానని, త్వరలో నేను కూడా ఒక ఛానెల్ స్టార్ట్ చేస్తానని చేసిన వ్యాఖ్యలతో విజయ సాయి మీడియాను బెదిరిస్తున్నారా.? లేక మీడియాను చూసి భయపడుతున్నారా.? అనేది తేలాల్సి ఉంది.