ఈ వయసులో డీఎన్ఏ టెస్ట్… ఇబ్బందే!

vijaya-sai-reddy

వైసీపి పెద్దల సభ సభ్యుడు విజయసాయి రెడ్డికి ఈ వయసులో రాకూడని కష్టం వచ్చిపడింది. ఈ వయసులో, ఈ స్థాయిలో ఉన్న ఆయనపై అక్రమ సంబందం ఆరోపణలు రావడం భరించడం కష్టమే.

ADVERTISEMENT

ఆమె మాజీ భర్త చేస్తున్న ఆరోపణలను, డీఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలని విసురుతున్న సవాళ్ళు, వాటి గురించి మీడియాలో వచ్చే వార్తలను ఖండించే ప్రయత్నంలో విజయసాయి రెడ్డి సామాన్య ప్రజలు ఎవరికీ ఇంతవరకు తెలియని కొత్త విషయాలు చాలానే చెపుతున్నారు. వాటితో ప్రజలకు ఇంకా ఆసక్తిపెరుగుతోంది. కనుక అది వారి తప్పు కాదు.

అలాగే ఆయన మీడియాపై విరుచుకుపడుతున్నకొద్దీ మీడియా కూడా ఈ స్టోరీపై ఆసక్తికర కధనాలు వండి ఆయనతో పాటు ప్రజలకు కూడా వడ్డించేస్తోంది.

ఈ అంశంపై తాజాగా ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే…. “అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

శాంతి కళింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్ గా వైజాగ్ సీతమ్మధార ఆఫీస్ లో మొట్టమొదటగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి పరామర్శించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను.

ఏ పరాయి మహిళతోను అనైతిక/అక్రమ సంబంధాలు లేవు. నేను నమ్మిన దేవ దేవులు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా చెప్తాను,” అని ట్వీట్‌ చేశారు.

అంత పెద్ద మనిషి ఇలాంటి స్పైసీ కబుర్లు చెపుతుంటే, నెటిజన్స్ మాత్రం చెవులు రిక్కించి వినకుండా ఉంటారా? తమ అమూల్యమైన అభిప్రాయాలు వెల్లడించకుండా ఉంటారా?

కనుక వారూ స్పందిస్తూనే ఉన్నారు. అవి చూస్తే తెలుగువారిలో ఇంత వెటకారం, హాస్య చతురత ఉన్నాయని అని సంతోషించాలో లేదా పాపం విజయసాయి రెడ్డికి ఈ వయసులో ఇటువంటి అపవాదు మెడకు చుట్టుకుందే… ఇన్ని నీలాపనిందలు భరించాల్సివస్తోందే… అని బాధ పడాలో అర్ధం కాదు. ఆయన సందేశానికి వచ్చిన కొన్ని స్పందనలు… యధాతధంగా…

“ఎవరికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు తాత.. కొడుకుని బాగా చూస్కో… అంతే… అది చాలు.”

“అక్కడ ఇక్కడా ఎందుకు ఆ DNA టెస్ట్ చేపించుకో ….ఒక పని ఐపోతుంది గా …. నీకు పిల్లలు కనే కత లేదు అన్ని మాకు తెలుసులే …. ఐనా అంత డబ్బులు ఎందుకు ఇచ్చావ్ …కోటి 60 లచ్చలు”

“ప్రమాణాలు పెద్ద పెద్ద మాటలు ఎందుకు సార్… మీ మీద నాకు నమ్మకం ఉంది… ఆ DNA టెస్ట్ ఏదో చేసి వాళ్ళ మొహం మీద కొట్టండి సార్…”

“కానీ ఒకటి మిగిలింది సర్ అందరి నోర్లు ముపించాలి అంటే మీరు కచ్చితముగా DNA టెస్ట్ చేపించుకోవాలి మేము DNA టెస్ట్ డిమాండ్ చేస్తున్నాము”

“నికార్సయిన వాడు ఎవ్వడికీ సంజాయిషీ ఇవ్వాల్సిన పని లేదు.”

“మీరు గౌరవ ప్రదమైన రాజ్య సభ సభ్యులు మరియు మోస్ట్ రెస్పెక్ట్డ్ క్యాస్ట్ లో పుట్టిన వాళ్ళు బాగా లేట్ వయసులోనైనా లేటెస్ట్ గ పుట్టిన కొడుకుని బాగా చూసుకోండి”

ఈ ఆరోపణలన్నిటికీ చెక్ పెట్టేందుకు ఆయన ఇలాంటి వాదనలు చేస్తున్నా పరువుపోతోంది. వాటికి చెక్ పెట్టేందుకు ఒకవేళ ఆయన డీఎన్ఏ టెస్ట్ కి సిద్దపడినా పరువుపోతుంది. పాపం విజయసాయి రెడ్డి… ఒంటరి పోరాటం చేస్తుంటే జగన్‌ అండగా నిలబడకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించయి ఢిల్లీలో ధర్నా చేద్దామని చెపుతున్నారేమిటో?

ADVERTISEMENT
Latest Stories