
ఇప్పుడంటే భారత్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఫైనల్స్ చేరలేదని భారత అభిమానులు దిగులు చెందుతున్నారు గాని, ఒక పదేళ్లు వెనక్కి వెళ్తే, మనవాళ్ళు బయట గ్రౌండ్లలో మ్యాచ్ గెలిస్తే చాలు అనుకుంటూ ఉండేవారు. గంగూలీ, సచిన్, ధోని వంటి లెజెండరీ బ్యాటర్లు, కెప్టెన్లు సైతం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల్లో తమ హవా కొనసాగించలేకపోయారు.
Also Read – టీడీపీని జగన్ రాజకీయ హైజాక్ చేశారా?
2014 -15 ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా 3 వ టెస్ట్ ను ముగించుకుని, ఆటగాళ్లంతా డ్రెసింగ్ రూమ్ లో ఉండగా, ఎం.ఎస్.ధోని తన టెస్ట్ రిటైర్మెంట్ ను ప్రకటించి, విరాట్ కోహ్లీ కు తన సారధి బాధ్యతలను అప్పగించాడు. అప్పటి ఆస్ట్రేలియా జట్టు స్లెడ్జింగ్, ఆన్-ఫీల్డ్ గొడవలు, ప్లేయర్స్ పై వ్యక్తిగత వాగ్వాదాలు చేసి క్రికెట్ కే ఫైర్-బ్రాండ్ గా తయారయ్యారు.
అప్పుడే కెప్టెన్ గా ఛార్జ్ తీసుకున్న కోహ్లీ, సిటీ కి కొత్తగా వచ్చిన పోలీస్ లాగా, వెధవ వేషాలు వేసే గుండాలను పట్టుకుని, వారిని సరిచేసి మరల మామూలు మనుషుల్ని చేసినట్టు, తన అగ్రేషన్ తో ఏకంగా ఆసీస్ నే భయపెట్టి, వారి అహంకారాన్ని అణగదొగ్గి, ఆస్ట్రేలియా వెళ్లి ఆసీస్ నే వొణికించి, అక్కడ సిరీస్ ను గెలిచిన మొదటి కెప్టెన్ గా నిలిచాడు కోహ్లీ.
Also Read – తొలి అడుగు చాలా అవసరమే!
కేవలం ఆస్ట్రేలియా లో నే కాక, ఇంగ్లాండ్ గడ్డ పై సైతం తన హవా ను కొనసాగించాడు. ఇంగ్లాండ్ కు వెళ్లి లండన్ లో టెస్ట్ ను గెలిచిన తొలి భారత కెప్టెన్ విరాట్. అలాగే ఆ సిరీస్ లో 2 మ్యాచ్లను గెలిచి, సిరీస్ ను సమం చేసాడు. ఇక, కెప్టెన్ గా ఉన్న కాలమంతా జట్టుకు ఆపదబంధవుడి లా వ్యవహరించాడు విరాట్. 2021 కాలానికి టెస్ట్ లలో 50 సగటు తో ఉన్న కోహ్లీ, ప్రస్తుత ఫామ్ లేమి తో సగటు 46 కు జారింది.
ఇక, తన టెస్ట్ కెరీర్ లో మొదటి సెంచరీ ని ఆసీస్ గడ్డ పైనే అందుకున్న కోహ్లీ, తన చివరి టెస్ట్ శతకాన్ని కూడా ఆస్ట్రేలియా గడ్డ పైనే అందుకున్నాడు. ఇలా, తాను దేశ జట్టు కు చేసిన సేవలను ఎవ్వరు మరిచిపోలేరు. విరాట్ కోహ్లీ మన దేశంలో టెస్ట్ ల కు పునర్జీవం పోసాడు అని చెప్పటంలో సంకోచమే లేదు. అలాంటి విరాట్ ఇప్పుడు తన ఫెవరెట్ ఫార్మటు లో రిటైర్మెంట్ ప్రకటించటం ఫాన్స్ ను ఆందోళన కు గురి చేస్తుంది.