ధోనిని పట్టించుకోని సెహ్వాగ్… రివెంజ్..?!

virender-sehwag-satire-on-dhoniప్రస్తుతం టీ20, వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు టీమిండియా కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేస్తూ వెల్లడించిన సంచలన నిర్ణయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాలో భాగమైన ప్రతి ఒక్కరూ… ఆఖరికి ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్ తో సహా అందరూ ఏదొక రూపంలో స్పందించారు. అయితే సోషల్ మీడియాలో ‘సూపర్ స్టార్ డమ్’ సంపాదించుకున్న టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం స్పందించకపోవడం విశేషం.

ఇటీవల కాలంలో సామాజిక సమకాలీన అంశాలపైన, ప్రధానంగా క్రికెట్ తో సంబంధం ఉన్న ప్రతి అంశంపైనా సెహ్వాగ్ ట్విట్టర్ వేదికగా ఎంతో సృజనాత్మకంగా స్పందిస్తున్న వైనం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అలాంటి సెహ్వాగ్ ధోనీ నిర్ణయం ఎలాంటి అభిప్రాయం వెల్లడించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచ క్రికెట్ కు బ్యాటింగ్ లో దూకుడు నేర్పించిన సెహ్వాగ్ ను చివరి దశలో జట్టు నుంచి తప్పించడమే కాకుండా, పునరాగమనం కల్పించేందుకు కూడా ధోనీ సహకరించలేదని, దీంతో సెహ్వాగ్ రంజీ క్రికెటర్ స్థాయిలో క్రికెట్ కు వీడ్కోలు పలకాల్సి వచ్చిందన్న వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

కాగా, ధోనీ రాజీనామాపై స్పందించని సెహ్వాగ్… ‘8వ స్థానంలో వున్న టీమిండియాను వరల్డ్ నెంబర్ 2 జట్టుగా రూపుదిద్దింది గంగూలీ’ అన్న ట్వీట్ ను రీ ట్వీట్ చేశాడు. కాగా, సెహ్వాగ్ చెప్పినట్టు జట్టు ర్యాంకు 8వ స్థానంలో వున్న తరుణంలో బాధ్యతలు చేబట్టిన గంగూలీ, తన కెప్టెన్సీలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని, దూకుడైన ఆటతీరుతో జట్టు గతిని మార్చి వరల్డ్ నెంబర్ 2 జట్టుగా తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే. సెహ్వాగ్, యువరాజ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్, ధోనీ వంటి వారికి అవకాశాలు కల్పించిన ఘనత గంగూలీదే కావడం విశేషం.

ADVERTISEMENT
Latest Stories