allu-arjun-and-shilpa-ravi-chandra-reddy

జగన్‌ 175/175 అనుకుంటే ప్రజలు ఆ రెండింటిలో నుంచి 75లు తొలగించేసి వైసీపీ 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు 11 వ తేదీన 11 గంటలకు మొదలవడంతో జగన్‌ దానిని అపశకునంగా భావించి మొహం చాటేశారు.

సంధ్య థియేటర్‌ వద్ద డిసెంబర్‌ 4 వ తేదీ రాత్రి సుమారు 11 గంటలకు పోలీసులు అల్లు అర్జున్‌ని థియేటర్‌ లోపల నుంచి బయటకు తరలించారు. అక్కడ జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ని ఏ-11గా పేర్కొన్నారు.

Also Read – ఇంతకీ కేజ్రీవాల్‌ మంచోడా కాదా?

ఈరోజు ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు. అల్లు అర్జున్‌ జీవితంలో ఒకేసారి ఇన్ని 11లు ఎప్పటి నుంచంటే మే 11నుంచి మొదలయ్యింది అని చెప్పవచ్చు.

ఆ రోజునే అల్లు అర్జున్‌ తన భార్యతో కలిసి నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్ధి శిల్పా రెడ్డి ఇంటికి వెళ్ళడంతో కరోనా వైరస్‌లాగా వైసీపీ నుంచి ఈ ‘వైరస్ 11’ అంటుకుంది. ఈ వైరస్ కారణంగానే ఆయన సినిమా ఫంక్షన్స్‌లో అనవసరమైన పంచ్ డైలాగ్స్ కొట్టారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Also Read – సంక్రాంతి గేమ్ చేంజర్‌ వెంకటేషే… మళ్ళీ విక్టరీ!

నేటికీ అల్లు అర్జున్‌ దానికి టీకా వేసుకోలేదు కనుక ‘వైరస్ 11’ పట్టిపీడిస్తూనే ఉంది. ఈ ‘వైరస్ 11’ వల్ల అల్లు అర్జున్‌ ఒక్కరే బాధపడితే అర్దం చేసుకోవచ్చు. కానీ ఇకపై ప్రివిలేజ్ షోలు, బెనిఫిట్ షోలు వేసుకునేందుకు, టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతించబోమని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం చిక్కుల్లో పడింది.




ఈ ‘వైరస్ 11’ వల్ల సినీ పరిశ్రమకు కీలకమైన సంక్రాంతి సీజన్లో విడుదలకు సిద్దమైన పెద్ద సినిమాలన్నిటికీ మాస్కులు పడ్డాయి. కనుక సినీ పరిశ్రమ ఈ వైరస్ 11’కి టీకా మందు కోసం తక్షణం ప్రయత్నాలు మొదలుపెట్టక తప్పదు.

Also Read – టిడిపికి కోటి దండాలు.. సభ్యత్వాలు!