Swaroopanandendra Swamy

వైసీపీ లో గత ఐదేళ్లుగా జగన్ కు వ్యతిరేకంగా నోరు విప్పే సాహసం ఆ పార్టీ నాయకుల నుంచి మంత్రి పదవులు అనుభవిస్తున్న నేతల వరకు ఏ ఒక్కరికి లేదనే చెప్పాలి. జగన్ చెప్పిందే మాట చేసిందే శాసనం అన్నట్టుగా నడుచుకున్నారు.

ఆ పార్టీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యే ల బలం సరిపోదు అన్నట్టుగా కొందరు సోషల్ మీడియా వేదికగా జగన్ కోసం ఎంతలా దిగజారగలరో అంతకు పది రేట్లు దిగజారి జగన్ భజన చేస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలను బూతులతో దూషించారు. మరికొంతమంది ఐ ప్యాక్ టీం లుగా మారి ప్రజలను ఎంతలా మభ్యపెట్టాలో అంతకు పదిరెట్లు మభ్యపెట్టారు.

Also Read – చంద్రబాబుకి కొమ్మినేని పాఠాలు… జగన్‌కి చెప్పలేదేమి?

ఇక ఈ సైన్యం కూడా సరిపోదు అన్నట్టుగా ఒక పక్క వైసీపీ సోషల్ మీడియా, పే టీమ్ బ్యాచ్, మరోపక్క బ్లూ మీడియా జగన్ ను ఆకాశానికెత్తేస్తూ ప్రజల ఆక్రంధనలు వినపడనీయకుండా చేసారు. ఇదంతా చాలదు అన్నట్టుగా తెర వెనుక అటు కేంద్ర బీజేపీ అండదండలు, ఇటు అప్పటి తెలంగాణ ప్రభుత్వ మద్దతు మెండుగా సంపాదించుకున్నారు జగన్.

లక్షల కోట్లు వెనకేసుకున్నా ఇంకా పేదవాడినే అంటూ నంగనాచి కబుర్లు చెప్పే జగన్ ఇంతమంది మద్దతు కూడగట్టుకున్నప్పటికీ ఇంకా మీ బిడ్డ ఒంటరిగా పోరాడుతున్నాడు అంటూ మొసలికన్నీరు కారుస్తూనే ఉన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, వాలంటీర్ వ్యవస్థలను వాడుకుంటూ తానూ చేసిందే చట్టం చెప్పిందే న్యాయం అన్నట్టుగా వ్యవహరించిన జగన్ శైలిని ఇంతవరకు ఆ పార్టీకి సంబందించిన వారెవ్వరు తప్పుపట్టలేదు.

Also Read – నాడు డిజిపిని కలవనీయలేదు…నేడు ఆమె వద్దకే

అయితే ఈ ఐదేళ్లుగా అటు ఖద్దర్ తో పాటుగా ఇటు కాషాయాన్ని తన గుప్పెటలో పెట్టుకున్న జగన్ కు ఇప్పుడు ఓటమి వాస్తవాన్ని చూపిస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చాక అనేక దేవాలయాల మీద దాడులు చేస్తూ ఎన్నో దేవత విగ్రహాలను ధ్వంసం చేసారు. అలాంటి దాడులకు పాల్పడిన ఏ ఒక్కరి పైన జగన్ సర్కార్ చర్యలకు ఆదేశాలివ్వలేదు.

వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాల మీద ఎన్ని దాడులకు పాల్పడిన జగన్ కు మద్దతు పలికిన ఏ ఒక్క పీటాధిపతి కూడా హిందూ మతానికి అనుకూలంగా జగన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టలేదు. కానీ వైసీపీ ఘోర ఓటమి తరువాత అప్పుడు మూసుకున్న ప్రతి వైసీపీ మద్దతుదారుల నోరు ఇప్పుడు తెరుచుకుంటుంది.

Also Read – వైసీపి పోటుగాళ్ళకి సన్మానాలు ఎప్పుడో… ఫాన్స్ వెయింటింగ్ ఇక్కడ!

గత ఐదేళ్లుగా అటు కేసీఆర్ కు ఇటు జగన్ కు భజన చేసిన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వైసీపీ కి వ్యతిరేకంగా తన గళం వినిపించారు. శ్రీశైలంలో కుంభాభిషేకం చేయకూడదని జగన్ ను హెచ్చరిస్తే కోర్ట్ కు వెళ్లి దాని ఆ తంతును పూర్తి చేసారు జగన్ అంటూ మొదటిసారిగా మీడియా ముందుకొచ్చారు స్వామిజి.

అలాగే వైసీపీ ప్రభుత్వంలో తిరుమల కొండ పవిత్ర దెబ్బ తిందని ఐదేళ్ల తరువాత ఈ స్వామిజి గ్రహించడం చూస్తే వైసీపీ ఓటమితో ఈయన జగన్ కు యూ టర్న్ చెప్పి బాబు పక్షాన చేరాడని సిద్దమయినట్టుగా ఉంది. అలాగే వైసీపీ గెలుపు కోసం సోషల్ మీడియాలో బాబు, లోకేష్, పవన్ లను తిట్టడానికి బూతులతో మాస్టర్ డిగ్రీ పొందిన మరికొంతమంది వైసీపీ తీవ్ర వాదులు నాలుక మడత పెట్టి వైసీపీ కి యూ టర్న్ కొడుతున్నారు.

ఇదంతా ఓటమి తాలూకా భయమో లేక జగన్ మీద ఉన్న ఆక్రోసమో లేక లోకేష్ రెడ్ బుక్ ఎఫెక్టో కానీ ఒక్కో వైసీపీ మద్దతుదారు జగన్ విషయంలో నాలుక మడతపెట్టేస్తున్నారు. మరి రాబోయే ఈ ఐదేళ్లల్లో ఇంకెంత మంది వైసీపీ కి యూ టర్న్ కొట్టబోతున్నారో.