జగన్‌ మూడు రాజధానులు గేమ్ చేంజర్‌ అనుకున్నారు. ఆ పేరుతో మూడు ప్రాంతాలలో ప్రాంతీయ విద్వేషాలు రగిలించి, టీడీపీ, జనసేనలు బయట తిరగకుండా చేద్దామనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ కలిసి గేమ్ చేంజర్‌ చేశారు.

‘తూచ్ మూడు కాదు.. ఒకటే రాజధాని! అది విశాఖే.. విశాఖ రాజధాని అయితేనే ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి అవుతాయి లేకపోతే ఎప్పటికీ అభివృద్ధి కావంటూ జగన్‌ బ్యాచ్ ప్రజలను భయపెట్టాలని చూసింది.

Also Read – విశాఖ రైల్వే జోన్‌కి ఇన్ని తిప్పలా?

రూ.500 కోట్ల ప్రజాధనంతో ఋషికొండపై విలాసవంతమైన ప్యాలస్‌లు కట్టుకొని… “విశాఖ రాజధాని అంటే అదే.. దానిలో జగన్‌ అడుగుపెడితే చాలు రాజధాని వచ్చేసిన్నట్లే’ అని ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నించారు. కానీ ప్రజలు మరోలా అర్దం చేసుకున్నారు. జగన్‌ తన కోసమే ఆ ప్యాలస్‌ కట్టుకున్నారని భావించారు!

విశాఖ రాజధాని ఎన్నికలలో గేమ్ చేంజర్‌ అవుతుందని గట్టిగా నమ్మిన జగన్‌ ప్రజలను కూడా నమ్మించేందుకు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి, శ్రీకాకుళంలో పోర్టులకి రెండోసారి శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టించారు.

Also Read – తెలుగు సినిమాలకు తెలంగాణ తలుపులు మూసుకుపోయిన్నట్లేనా?

విశాఖ రాజధాని అయితే ఆటోమేటిక్‌గా ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందిపోతాయని వాదించినప్పుడు, మళ్ళీ ఎయిర్ పోర్టు, పోర్టులు దేనికీ?అని ప్రజలు అనుకున్నారో ఏమో? ఎన్నికలలో గేమ్ ఛేంజ్‌ చేసేశారు. జగన్‌ని, విశాఖ రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాలను దోచుకున్న వైసీపీ ముఠాలని గద్దె దించేశారు.

కనుక జగన్‌ వైసీపీ విషయంలో విశాఖపట్నమే గేమ్ చేంజర్‌ అని భావించవచ్చు. కానీ సిఎం చంద్రబాబు నాయుడుకి, కూటమి ప్రభుత్వానికి కూడా విశాఖపట్నమే గేమ్ చేంజర్‌ కావడం విశేషం.

Also Read – అన్న వచ్చాడు…చెల్లి రాలేదే.?

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ పేరుతో రాజకీయాలు చేసి గేమ్ ఛేంజ్ చేసి చంద్రబాబు నాయుడుని దెబ్బ తీయాలని జగన్‌ ప్రయత్నిస్తే, ఆయన అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి నిధులు సాధించి, వైసీపీ కోరుకున్నట్లే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఉండబోదని నేడు ప్రకటింపజేసి గేమ్ ఛేంజ్ చేశారు.




ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ దావోస్‌ సదస్సుకి బయలుదేరుతున్నారు. వారి టార్గెట్ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు, విశాఖ నగరానికి ఐటి కంపెనీలు సాధించడమే. అదీ సాధిస్తే రాష్ట్ర రాజకీయాలలో తప్పక గేమ్ ఛేంజ్ అవుతుంది.