నిజమైన ‘శ్రీమంతుడు’ అవతారం దాల్చిన ‘హీరో’

vivek-oberoi-mission-360ప్రముఖ బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్ అల్పాదాయ వర్గాల ప్రజలకు 5 లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. ‘మిషన్ 360’ పేరుతో మహారాష్ట్రలోని 360 ప్రాంతాల్లో ఈ ఇళ్లు నిర్మించనున్నామని ‘రక్తచరిత్ర’ హీరో తెలిపాడు. 2022 నాటికి ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఉండాలన్న ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యాన్ని స్పూర్తిగా తీసుకుని అల్పాదాయ వర్గాల ఇళ్లకు రూపకల్పన చేసినట్టు తెలిపారు.

తమ ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని, లాభాలు ఆశించకుండా మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ ఇళ్ల ధరను 7,90,000 రూపాయలుగా నిర్ణయించామని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి భూమిని సేకరించలేదని, ప్రైవేటుగా సేకరించామని, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తమకు ఇలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయని, అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రాజెక్టును పూర్తి చేయడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు.

ADVERTISEMENT

ప్రాక్టికల్ గా ఆలోచిస్తే… గ్రామాలను బాగుచేసే కన్నా ఇలా పేద వారికి, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పర్మినెంట్ నివాసాన్ని ఏర్పాటు చేస్తే అంతకు మించిన అభివృద్ధి మరొకటి ఉండదని చెప్పవచ్చు. ఆ దిశగా అడుగులు వేస్తూ… నిజమైన ‘శ్రీమంతుడు’ అవతారం దాలుస్తున్న వివేక్ ఒబరాయ్ ను ఈ సందర్భంగా అభినందిద్దాం.

ADVERTISEMENT
Latest Stories