వివేకా కేసులో కొత్త ట్విస్ట్… యమ డేంజర్!

Viveka Case: SC Orders Worry YSRCP, Not Relief

ఆశావాదికి గ్లాసులో సగం వరకు నీళ్ళు ఉన్నాయంటే నిరాశావాది సగం ఖాళీ అయిపోయిందంటాడు. వివేకా హత్య కేసులో వైసీపీ సొంత మీడియా చెప్పిన మాటలు కూడా ఆశావాది మాటల్లాగే ఉన్నాయి.

ఈ కేసు గురించి సుప్రీంకోర్టు ఏమి చెప్పిందనే విషయాలన్నీ పక్కన పెట్టేసి, ఈ కేసులో నిందితుల బెయిల్‌ రద్దు విషయంలో తాము కలుగజేసుకోమని చెప్పిందనే వాఖ్యం ఒక్కటే హైలైట్ చేసి తీర్పు అనుకూలంగా వచ్చేసిందన్నట్లు వ్రాసుకుంది.

ADVERTISEMENT

కానీ జరిగిన విషయం ఏమిటంటే, దాదాపు 5 ఏళ్ళకు పైగా సాగుతున్న వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే కొనసాగిస్తామని సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీరాజు తెలియజేశారు.

ఈ కేసులో పిటిషనర్ సునీతా రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూద్రా తన వాదనలు వినిపిస్తూ ఈ కేసుని మరింత లోతుగా దర్యాప్తు చేయించాలని అభ్యర్ధించారు.

ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత, సీబీఐ విచారణ కొనసాగించాలని కోరుతూ ట్రయల్ కోర్టులో పిటిషన్‌ వేసుకోమని సిద్దార్ధ లూద్రా (సునీతా రెడ్డి)కి సూచించింది.

దీని కోసం రెండు వారాల్లోగా పిటిషన్‌ వేయాలని, 8 వారాల్లోగా ఆ పిటిషన్‌ మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టుని ఆదేశించింది.

ఈ కేసుని ట్రయల్ కోర్టుకి అప్పగిస్తున్నందున అంతవరకు అంటే 8 వారాల వరకు ఈ కేసు నిందితుల బెయిల్‌ రద్దు కేసుని వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.

దీనినే వైసీపీ సొంత మీడియాలో తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందన్నట్లు చెప్పుకుంటోంది. కనుక సునీతా రెడ్డి పిటిషన్లు కొట్టివేసి తదుపరి విచారణ అవసరం లేదని చెపితే వైసీపీ సంతోషించవచ్చు. కానీ ఈ కేసుని మరింత లోతుగా సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ ట్రయల్ కోర్టులో పిటిషన్‌ వేసుకోమని సుప్రీంకోర్టు సూచించింది. అదే జరిగితే తర్వాత ఏం జరుగుతుందో, అది ఎక్కడ ముగుస్తుందో అందరికీ తెలుసు.

కనుక ఇది వైసీపీకి చాలా ఆందోళన కలిగించే విషయమే తప్ప సంతోషించాల్సిన విషయం కానే కాదు. కానీ ఇటువంటి ఆందోళనకర సమయంలో ఈ మాత్రం అల్ప సంతోషం కూడా చాలా అవసరమే.

ADVERTISEMENT
Latest Stories