
అనేక దశాబ్ధాల పాటు లాభాలలో నడిచిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ క్రమంగా నష్టాల బాట పట్టి అప్పులలో మునిగిపోయింది. అలా ఎందుకు జరిగిందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బాగా తెలుసు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో సుమారు 40,000 మందికి పైగా పనిచేస్తున్నారు. అంటే అన్ని వేల కుటుంబాలు దానిపై ఆధారపడి ఉన్నాయన్న మాట! కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కానీ ప్రైవేటీకరణకు సిద్దపడింది.
Also Read – ఈ పైరసీల ఫాంటసీ ఏంటో..? దీనికి వాక్సిన్ లేదా.?
అప్పుడు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని కాపాడేందుకు ముందుకు వచ్చారు కానీ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు.
కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల అదృష్టం కొద్దీ ఏపీలో ప్రభుత్వం మారింది. కేంద్రంలో సిఎం చంద్రబాబు నాయుడుకి ప్రాధాన్యత పెరిగింది. ఆయన చొరవ తీసుకొని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి బ్రేకులు వేయించగలిగారు.
Also Read – ఏపీలో క్రూజ్ పర్యాటకం త్వరలో..
ప్లాంట్ ఆర్ధిక సమస్యల పరిష్కారానికి రూ.11,440 కోట్లు నిధులు కూడా విడుదల చేయించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంటే పట్టించుకోని వైసీపీ నేతలు, ఆనాడు తాము కేంద్రంపై ఒత్తిడి చేయడం వలననే ఆ ఆలోచన విరమించుకుంది తప్ప చంద్రబాబు నాయుడు చొరవ వలన కాదని క్రెడిట్ తమ పద్దులో రాసుకునే ప్రయత్నం చేశారు.
నిజానికి వారు అధికారంలో ఉన్నప్పుడే చిత్తశుద్ధితో ప్రయత్నించి ప్రైవేటీకరణని అడ్డుకొని ఆ క్రెడిట్ తీసుకుంటే అందరూ హర్షించేవారు. కానీ ఈ ఇప్పుడు ఈ క్రెడిట్ కోసం వారు ప్రాకులాడటం చూస్తే వేరొకరికి పుట్టిన బిడ్డకి నేనే తండ్రినని చెప్పుకున్నట్లే అనిపిస్తుంది.
Also Read – బురద జల్లుతున్నా బాబు ప్రతిష్ట ఇలా పెరిగిపోతోందేమిటి?
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి రూ.11,440 కోట్లు నిధులు విడుదల చేసి కేంద్రం చేతులు దులుపుకుంటే ఈ సమస్య మళ్ళీ మొదటికే వస్తుందని వేరే చెప్పక్కరలేదు. కనుక ఈ సమస్యకు శాశ్వితంగా పరిష్కరించేందుకు సిఎం చంద్రబాబు నాయుడు, ఇద్దరు కేంద్ర మంత్రులు గట్టిగా కృషి చేస్తూనే ఉన్నారు. బహుశః వారి కృషి ఫలించన్నట్లుంది.
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ సమస్యలపై చర్చించడానికి గురువారం ఢిల్లీ నుంచి వైజాగ్ వచ్చారు. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమవుతున్నారు. బహుశః ఈ సమావేశంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలన్నిటికీ పరిష్కారం లభించకపోయినా నష్టాల ఊబిలో నుంచి బయటపడేందుకు ఏమేమి చేయాలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి కూతవేటు దూరంలో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రూ.70,000 కోట్ల పెట్టుబడితో ఆర్సలర్-మిట్టల్ కంపెనీలు ప్రైవేట్ రంగంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి లాభసాటిగా నడిపించగలమని భావిస్తున్నప్పుడు, దశాబ్ధాల అనుభవం ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు నడిపించుకోలేము? అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తే తప్పకుండా కాపాడుకోవచ్చు.