telangana-andhra-pradesh-water-wars-chandrababu-naidu

కృష్ణ, గోదావరి జలాల కోసం ఏపీ, తెలంగాణల మద్య పదేళ్ళుగా పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. అయితే అవి కేవలం సాగునీరు, రైతుల ప్రయోజనాల కోసమే జరిగితే అర్దం చేసుకోవచ్చు.

Also Read – అరెస్ట్‌ అయితే ముఖ్యమంత్రి కారన్న మాట!

కానీ ఈ పేరుతో బిఆర్ఎస్ పార్టీ ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొడుతూ తమవైపు తిప్పుకొని కాంగ్రెస్‌, బీజేపిలను రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తుంటుంది.

బిఆర్ఎస్ పార్టీ దీనిని పెద్ద సమస్యగా మార్చేసి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోంది గనుక కాంగ్రెస్‌, బీజేపిలు కూడా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌‌ ప్రభుత్వంతో పోరాటాలు చేయక తప్పడం లేదు.

Also Read – జగన్‌కి విరుగుడు వారిద్దరే… ఏమవుతుందో?

దక్షిణాదిన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు కూడా ఈవిదంగా నదీ జలాల పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

ఇందుకు మరో చక్కటి ఉదాహరణగా 2023 డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్నప్పుడు, బిఆర్ఎస్ పార్టీకి లబ్ధి కలిగించేందుకుగాను కేసీఆర్‌ ఆప్తమిత్రుడైన జగన్మోహన్ రెడ్డి ఏపీ సాగునీటిశాఖ అధికారులను, పోలీసులను సాగర్ డ్యామ్‌పైకి పంపించి బలవంతంగా గేట్లు తెరిపించారు. అప్పుడు ఏపీ, తెలంగాణ అధికారులు, పోలీసుల మద్య డ్యామ్‌పై చిన్నపాటి యుద్ధం జరిగింది.

Also Read – ఈ పైరసీల ఫాంటసీ ఏంటో..? దీనికి వాక్సిన్ లేదా.?

బిఆర్ఎస్ నేతలు దానిని చూపిస్తూ “చూశారా మన మీద ఆంధ్రావాళ్ళు ఎలా దౌర్జన్యం చేస్తున్నారో? మన నీళ్ళని ఎలా దోచుకొని పోతున్నారో? కేసీఆర్‌ ఉంటేనే ఆంధ్రా పాలకుల నీళ్ళ దోపిడీని అడ్డుకోగలరు,” అంటూ పోలింగ్ సమయంలో ప్రజలలో సెంటిమెంట్ రగిలించి ఓట్లు దండుకునేందుకు ప్రయత్నించారు.

తెలంగాణలో పోలింగ్ ముగియ్యగానే ఏపీ అధికారులు, పోలీసులు అక్కడి నుంచి వెనక్కు వచ్చేశారు. మళ్ళీ ఎప్పటిలాగే తెలంగాణ అధికారులు, పోలీసులు డ్యామ్‌ని తమ అధీనంలోకి తీసుకున్నారు!

నదీజలాల పంపకాల పేరుతో ఏవిదంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు జరుగుతాయో గ్రహించేందుకు ఇంతకంటే మంచి నిదర్శనం ఏముంటుంది?

కనుక ఇరు రాష్ట్రాల ప్రతినిధులు మాట్లాడుకొని పరిష్కరించుకోగలిగిన ఈ సమస్యలపై ఏళ్ళ తరబడి రెండు రాష్ట్రాల మద్య పోరాటాలు సాగుతూనే ఉన్నాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే గోదావరి మిగులు జలాలను కృష్ణ జలాలతో అనుసంధానం చేసి, ఆ నీటిని కరువు ప్రాంతాలైన రాయలసీమ జిల్లాలకు సాగుత్రాగు నీరు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుని ప్రతిపాదిస్తూ కేంద్రానికి లేఖ వ్రాశారు.

ముందే చెప్పుకున్నట్లు ఇటువంటి సమస్యలతో ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ మైలేజ్ సంపాదించుకునే దురలవాటున్న బిఆర్ఎస్ పార్టీ చేతికి ఇది వజ్రాయుధంలా దొరికింది.

ప్రస్తుతం ఆ పార్టీ చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. కనుక దీనిని రాజకీయ ఆయుధంగా వాడుకునే ప్రయత్నం చేస్తూ, ‘గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు కడుతుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకి సహకరిస్తున్నారంటూ’ దుష్ప్రచారం మొదలుపెట్టేసింది.

బిఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వంపై బురద జల్లుతూ రాజకీయ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుండటంతో, తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడటంలో మేమూ ముందుంటామని నిరూపించుకునేందుకు, కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా రంగంలో దిగి ఏపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించక తప్పలేదు.

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుని అనుమతించవద్దని కోరుతూ తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ కుమార్‌ రెడ్డి కేంద్రానికి లేఖ వ్రాశారు. ఎట్టి పరిస్థితులలో ఈ ప్రాజెక్టుకి అనుమతులు మంజూరు చేయవద్దని, ఒకవేళ అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం ఈ పనులకు టెండర్లు పిలిస్తే అడ్డుకోవాలని కోరారు.

అయితే కేంద్ర ప్రభుత్వం దేశంలో నదులను అనుసంధానం చేసి అన్ని జిల్లాలకు సాగు,త్రాగు నీరు అందించాలని భావిస్తోంది. కనుక ఆ ప్రకారమే ఏపీ ప్రభుత్వం కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం చేసి ఈ గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుని ప్రతిపాదిస్తోంది.




కనుక కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదించి సహకరిస్తుందా లేక తెలంగాణలో రాజకీయ లెక్కలు, బీజేపి ప్రయోజనాలు చూసుకొని అనుమతి నిరాకరిస్తుందా?అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.