వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమకు ఎదురైనన్ని చేదు అనుభవాలు, సినీ ప్రముఖులకు ఎదురైనన్ని అవమానాలు నభూతో నభవిష్యతి అనే చెప్పాలి. సామాన్యుడికి అవసరమైన నిత్యావసరాలు, భక్తులకు అవసరమైన దర్శన సదుపాయాల విషయంలో గుర్తురాని ధరల తగ్గింపు విధానాలు ఒక్క సినీమా టికెట్ల విషయంలోనే మాత్రమే గత ప్రభుత్వానికి జ్ఞప్తికి వచ్చాయి.
అయితే నాడు ఈ టికెట్ రేట్లతో సినిమాలు విడుదల చేయడానికి సంకోచించిన టాలీవుడ్, సమస్య పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే యావత్ సినీ పరిశ్రమకు సంబంధించి పెద్దన్న పాత్రలో సమస్య పరిష్కారానికి మెగాస్టార్ చిరు తన తోటి నటులను, దిగ్గజ దర్శకులను వెంటేసుకుని అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్ తాడేపల్లి ప్యాలస్ కు చేరుకున్న విషయం ఇక ఆ తరువాత జరిగిన పరిణామాలు అన్ని అందరికి విదితమే.
Also Read – ఆర్జీవీ…’మెగా’ సెటైర్స్..!
అయితే నాడు మెగాస్టార్ వంటి అగ్ర హీరో చేతులు జోడించి తల్లి స్థానంలో ఉన్న పేరు ఇండస్ట్రీ బాగు కోసం కాస్త పెద్ద మనసు చూపాలి అంటూ జగన్ ను అభ్యర్దించడం, దానికి జగన్ పెడ ముఖం పెట్టడం అటు మెగా అభిమానులనే కాదు ఇటు యావత్ చిత్ర పరిశ్రమనే కలిచి వేసింది. నాడు చిరుతో పాటుగా ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సూపర్ స్టార్ మహేష్, రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు జక్కన్న, కొరటాల శివ వంటి స్టార్ సెలబ్రేటిస్ జగన్ ముందు ప్రణమిల్లారు.
అయినా వైసీపీ ప్రభుత్వం నుండి సినీ పరిశ్రమకు వచ్చిన ఫలితం శూన్యం. అయితే నేడు సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ఇక పై తెలంగాణలో బెనిఫిట్ షో లు రద్దు, అలాగే సినిమా టికెట్ల రేట్ల విషయంలో కూడా కఠినంగా ఉంటామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీ సాక్షిగా టాలీవుడ్ ను ఉద్దేశించి ప్రకటనలు చేసారు. అందుకు తగ్గట్టే కాంగ్రెస్ మంత్రులు కూడా సీఎం నిర్ణయానికి మద్దతు తెలిపారు.
Also Read – మీడియా వారు జర భద్రం…!
దీనితో ఈ సంక్రాంతికి థియేటర్లకు రాబోతున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకీ సంక్రాంతికి వస్తున్నాం….సినిమాల విషయంలో ఎం చెయ్యాలి అనే తర్జన భర్జన పడిన టాలీవుడ్ ఈ సమస్య పరిష్కారానికి గాను దిల్ రాజునూ రంగంలోకి దింపింది. సుదీర్ఘ చర్చల అనంతరం, దిల్ రాజు తెలంగాణ ప్రభుత్వ పెద్దల దిల్ కరిగించగలిగారు. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ సినిమాకు టికెట్ల రేట్లను పెంచుకోగలిగారు.
నాడు ముఖ్యమంత్రిగా జగన్ అంతమంది సినీ ప్రముఖులు కలిసి వచ్చినా కనీసం తమ ప్రభుత్వం నుండి సినీ పరిశ్రమ బాగు కోసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. కానీ నేడు రేవంత్ తానూ అసెంబ్లీ వేదిక ఇచ్చిన స్టేట్మెంట్ ను కూడా వెనక్కి తీసుకుని టాలీవుడ్ మేలు కోసం దిల్ రాజు అభ్యర్థనకు ముందడుగు వేశారు.
Also Read – జగన్ స్కిల్ సుప్రీంకోర్టుకీ నచ్చలే!
అయితే నాడు చిరు సాధించలేనిది నేడు దిల్ రాజు సాధించగలిగాడు అంటే అది కేవలం సీఎం లుగా రేవంత్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి ల వ్యక్తిత్వ శైలి మాత్రమే. నాడు వైసీపీ ప్రభుత్వం పరిశ్రమ పెద్దలు అడిగినట్లుగా సినిమా టికెట్లు రేట్లు పెంచినా, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిన అప్పటి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, వైసీపీ మీద విమర్శలు చేసేది కాదు.
కానీ ఇప్పుడు రేవంత్ సినీ పరిశ్రమ పై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ద్వారా అటు ప్రతిపక్షమైన బిఆర్ఎస్ చేత ఎదురు దాడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినా కూడా రేవంత్ రెడ్డి దిల్ రాజు అభ్యర్థనకు ఆమోద ముద్ర వేశారు. అందుకే పెద్దలు అంటుంటారు ఎందులో అయినా కాస్త పట్టు విడుపు ఉండాలని. అది ముఖ్యమంత్రిగా జగన్ కు అప్పుడు లేకపోవడం వల్లనే వైసీపీ కి ఇప్పుడీ పరిస్థితి.