లక్షల కోట్ల అవినీతి సంపాదన…వేల కోట్ల విలువ చేసే ప్యాలస్ లు…వందల కోట్ల విలువ చేసే పార్టీ కార్యాలయాలు…ఇలా ఎటు చూసిన తన చుట్టూ నోట్ల కట్టలతో కోట్లను కట్టుకుంటూ ఒక మహారాజు జీవితాన్ని అనుభించాలని ఆశపడుతున్న అతి పేదవాడు జగన్ మామ అని ఇప్పుడిప్పుడే బయట సమాజానికి తేటతెల్లమవుతుంది.
అక్రమంగా సంపాదించింది సంక్రమగా అనుభవించడానికి ముఖ్యమంత్రి హోదానే సరైనదని భావించిన జగన్ అందుకు చేయాల్సిన అన్ని కార్యాలను తెర ముందు, తెర వెనుక పూర్తి చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని ఏపీలో తన కోటల సామ్రాజ్యాన్ని అన్ని జిల్లాలో విస్తరించారు.
అయితే కాలం ఎప్పుడు ఒకరికి అనుకూలంగానే తిరుగుతుంది అనుకోవడం ఆ వ్యక్తుల వెర్రితనమే అవుతుందని మరోసారి నిరూపించింది ధర్మం. 151 సీట్లతో ఇచ్చిన అధికారాన్ని తిరిగి లాక్కుకుని 11 సీట్లకే పరిమితం చేసి కనీసం రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వైసీపీ పార్టీకి, జగన్ కు వ్యతిరేకంగా బటన్ నొక్కారు ఓటర్లు.
దీనితో గత ఐదేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష పార్టీ నేతల పై జగన్ అండ్ కో చేసిన ధమన ఖాండ ను గుర్తుచేసుకుంటున్న జగన్ అసెంబ్లీకి వెళ్ళే సాహసం చేయలేకపోతున్నారు. ప్రజా ప్రతినిధిగా అసెంబ్లీ లో తన ప్రమాణస్వీకారం చేయడానికి వచ్చిన జగన్ వచ్చిన పని పూర్తి చేసుకుని పలాయనం చిత్తగించారు.
ఆ మరుసటి రోజు జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో తన సొంత నియోజకవర్గ పర్యటనకు శ్రీకారం చుట్టారు. దీనితో శాసన సభ సమావేశాలకు హాజరయ్యే ధైర్యం లేక పులివెందుల పులి తన సొంత నియోజకవర్గం పారిపోయింది అనే అవమానాన్ని మూటకట్టుకున్నారు జగన్.
అయితే విచిత్రంగా జగన్ కు తన కంచుకోటలోనే సొంత పార్టీ శ్రేణుల నుండి తీవ్ర నిరసన సెగ ఎదురయ్యింది. వైసీపీ ఓటమికి కారణాలు జగన్ కు తెలియకపోయిన గ్రౌండ్ లెవెల్ లో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు అర్దమవ్వడంతో ఓటమికి కేవలం జగన్ అహం, మూర్కత్వమే కారణం అంటూ వైసీపీ కార్యకర్తలకు జగన్ మీద బీపీ వచ్చి పులివెందుల ప్యాలస్ మీద దాడి చేసారు.
దీనితో తానూ పుట్టి పెరిగిన తన సొంత ఊరులోనే జగన్ కు ఈ రకమైన అవమానం ఎదురవడంతో జగన్ పరిస్థితి “నడి సముద్రంలో నావ మాదిరి” అటు కిందకు దిగలేరు, ఇటు నావలోను ఉండలేరు. అటు తాడేపల్లిలో ఉంటూ శాసన సభలకు హాజరవ్వకుండా ఉంటే పులివెందుల పులి భయపడింది అంటూ హేళన చేస్తారు.
అలా కాకుండా జగన్ ఇప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే కాబట్టి తన నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని కొన్నాళ్ళు కాలం వెళ్లబుచ్చేద్దాం అని ఆశపడ్డా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అనేది ఈ ఘటనతో జగన్ కు స్పష్టమయ్యింది. కాబట్టి ఇటు పులివెందులలోని ఉండలేని దయనీయ స్థితికి జగన్ చేరుకున్నారు.
ఒకవేళ మళ్ళీ పాదయాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుడదాం అనుకున్నా సొంత నియోజకవర్గంలోనే జగన్ కు ఈ స్థాయిలో వ్యతిరేకత ఎదురైతే ఇక మిగిలిన ప్రాంతాలలో ఇప్పుడున్న పరిస్థితులలో జగన్ పర్యటిస్తే వైసీపీ కార్యకర్తల నుంచే జగన్ కు భారీ భద్రత అవసరముతుంది. అంత సాహసానికి జగన్ ముందుకొస్తారా.?
అసలు ఇవేమి కాకుండా ఆంధ్రా నుంచి తెలంగాణకు మకాం మార్చి అక్కడున్న లోటస్ పాండ్ లో ఈ ఐదేళ్ళు కళ్ళు మూసుకుందాం అనుకుంటే అక్కడికి వెళ్ళడానికి జగన్ కు కోర్టుల రూపంలో మరో గండం సిద్ధంగా ఉంది. అసలే తెలంగాణలో తన ఆప్త మిత్రుడు కేసీఆర్ అధికారానికి దూరమయ్యి ఫామ్ హౌస్ కు చేరువయ్యారు.
అదీ కాక అక్కడ ఒక పక్క బాబు శ్రేయోభిలాషి, మరోపక్క చెల్లి షర్మిలకు దొరికిన కొండంత అండ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవన్నీ చాలవన్నట్టుగా దశబ్దన్నర కాలం నుండి తనను నీడలా వెంటాడుతున్న అక్రమ ఆస్తుల కేసులు, విచారణలు జగన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. కేసీఆర్ కు అధికారం లేకపోతే ఫామ్ హౌస్ కు మాత్రమే వెళతారు.
కానీ జగన్ కు అధికారం దూరమైతే తానూ ఎంతో మోజు పడి కట్టించుకున్న ప్యాలస్ లో కాదు జైల్లో ఉండాల్సిన పరిస్థితి. ఇప్పటికే జగన్ తన కేసుల విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలిస్తూ నాంపల్లి సిబిఐ న్యాయస్థానం అడుగు ముందుకు వేసింది. దీనితో జగన్ కు లోటస్ పాండ్ గేట్లు కూడా మూసుకున్నట్లే.
ఉరోకో ప్యాలస్ నిర్మించుకున్న జగన్ ఒక్క ఓటమితో అటు ప్యాలస్ లలో ఉండలేక, శాసనసభలకు హాజరు కాలేక, ఓదార్పు, పాదయాత్రల పేరుతో రోడ్ల మీద తిరగలేక, హైద్రాబాద్ వెళ్లలేక, విదేశాలు వెళ్ళడానికి పర్మిషన్లు లేక ఎక్కడికి వెళ్లాలో తెలియక సింహం సింగల్ అంటూ చేసుకున్న ప్రచారంతో చివరికి సింగల్ గానే మిగిలిపోనునున్నారా.? దీనితో ఇప్పుడు ఎక్కడికి పోతావు జగన్ మామ…అంటూ సోషల్ మీడియాలో జగన్ ఓదారుస్తున్నారు.




