
నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంలో అసెంబ్లీ ప్రాంగణం వద్ద పులివెందుల ఎమ్మెల్యే వైస్ జగన్ నల్ల కండువాలతో చేసిన హంగామా మాములుగా లేదు. అసలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్న సందేహానికి ఫుల్ స్టాప్ పెట్టి అసెంబ్లీకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి పోలీసు అధికారులను బెదిరిస్తున్న
వ్యాఖ్యలు విస్మయానికి గురి చేసాయి.
Also Read – షర్మిల ఫోన్ కేసీఆర్ ట్యాపింగ్ చేయిస్తే నాకేం సంబందం?
నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జగన్ ప్రతిపక్షానికి రాగానే ఒక్కసారిగా పోలీస్ అధికారులను పేరు పెట్టి సంబోధిస్తూ మధుసూధన రావు గుర్తు పెట్టుకో ఎల్లకాలం ఇదే మాదిరి ఉండదు, ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, మీ పోలీసు టోపీ మీద ఉన్న సింహంలాకు అర్థమేమిటో తెలుసా మీకు?
అధికారంలో ఉన్న వాళ్లకు సలాం కొట్టడం కాదు అంటూ గొంతు పెద్దగా చేసుకుని జగన్ చేసిన బెదిరింపులు ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టా? అనేది జగన్ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పోలీస్ వ్యవస్థను బెదిరించడం అంటే వ్యవస్థలను నిర్వీర్యం చెయ్యడమే అవుతుంది.
Also Read – కొమ్మినేనికి ప్రమోషన్ ఖాయమేనా.?
గత ఐదేళ్లల్లో జగన్ వ్యవస్థలకు ఏ మాత్రం స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఇచ్చారో రాష్ట్ర ప్రజలందరికీ విధితమైన విషయమే. అధికారం పోగానే హక్కులు గుర్తుకొచ్చిన జగన్ కు అధికారంలో ఉన్నాళ్ళు బాధ్యత గుర్తు రాలేదా? మీడియా స్వేచ్ఛను హరించి, వ్యవస్థల స్వాతంత్రియాన్ని కాలరాసి, ప్రతిపక్షాల హక్కులకు కళ్లెం వేసి జగన్ ప్రభుత్వం నియంత పాలనను గుర్తు చేసింది.
పోలీస్ వ్యవస్థను తన చేతిలో ఆయుధం కింద ఉపయోగించి గత ఐదేళ్లు రాష్ట్రంలో జగన్ చేసిన విధ్వంసకర పాలన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దిశా దశను మార్చేశాయి. వాటి ఫలితాలే ఈ నాటి చర్యలకు నాంది పలుకుతున్నాయి. ఈ అధికారం ఏ ఒక్కరి సొంతం కాదు అనే విషయాన్నీ జగన్ నాడు గుర్తుంచుకుంటే ఈనాడు రాష్ట్రంలో ఈ పరిస్థితులు తలెత్తేవి కాదు.
Also Read – వైసీపీలకి పవన్ వార్నింగ్… అబ్బే డోస్ సరిపోదు!
వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి నోరున్నోడిదే రాజ్యం, డబ్బున్నోడే నాయకుడు, తెగించిన వాడే నా వాడు అంటూ ఆగతంలో హత్య రాజకీయాలను ప్రోత్సహించి జగన్ నేడు సాధారణ హత్యలను కూడా రాజకీయ హత్యలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ప్రజల ముందు నవ్వులపాలవుతున్నారు.
151 సీట్లతో అధికారాన్ని కట్తపెట్టిన 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయినా జగన్ మాత్రం తన శవ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. అలాగే తానూ చెప్పిందే న్యాయం, చేసేదే ధర్మం, అమలు పరిచిందే చట్టం అన్నట్టుగా జగన్ వ్యహరిస్తున్న తీరు ఏపీ రాజకీయాలను మరింత దిగజారుస్తున్నాయి.
రాజధానికి భూములిచ్చిన రైతులకు కనీసం తమకు జరిగిన అన్యాయానికి నిరసన తెలిపే ప్రాథమిక హక్కును కూడా కల్పించలేని జగన్ కు ప్రజాస్వామ్య విలువలు గురించి ప్రశ్నిచే నైతిక హక్కు ఉంటుందా.? తన అక్క పట్ల అమానుషంగా ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న 15 ఏళ్ళ అమర్నాధ్ అనే చిన్న పిల్లాడిని వైసీపీ మూకలు పెట్రోల్ పోసి కాల్చి చంపినప్పుడు జగన్ యోగ నిద్రలో ఉన్నారా?
అప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగలేదా? గత ఐదేళ్లలో పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని బాధితులనే నిందితులుగా మార్చిన ఘనత జగన్ సొంతం. దానికి ప్రత్యక్ష ఉదాహరణ డా. సుధాకర్ అనే సామాన్య పౌరుడు నుండి బాబు, పవన్ , లోకేష్ వరకు అందరు వైసీపీ బాధితులుగానే మిగిలారు.
సొంత పార్టీ ఎమ్మెల్సీ అనంత బాబు, ఎంపీ అవినాష్ రెడ్డి మీద హత్యారోపణలు వచ్చినప్పటికీ వారి పై ఎటువంటి చర్యలు తీసికుండా ఇదే పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్ వారిని చట్టం నుంచి కాపాడుకున్న మాట వాస్తవం కాదా? అప్పుడు చట్టాలను వైసీపీ చుట్టలుగా మార్చిన జగన్ ఇప్పుడు పోలీస్ వ్యవస్థను హెచ్చరించడం శోచనీయం.