సినిమా బాగున్నా బాలేకున్నా అంతిమంగా దాన్ని నిర్ణయించేది ప్రేక్షకులే. ఒకప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి వారం తర్వాత వచ్చే మ్యాగజైన్లలో లేదా చూసొచ్చిన వాళ్ళ ద్వారానో కాస్త ఆలస్యంగా టాక్, రివ్యూలు తెలిసేవి కానీ ఇప్పుడలా కాదు. అంతా క్షణాలు నిమిషాల్లో జరిగిపోతోంది. ఆదిపురుష్ శుక్రవారం తెల్లవారుఝామున బెనిఫిట్ షో పూర్తి చేసుకున్నప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా చిత్ర విచిత్రమైన ట్రోల్స్ దర్శనమిస్తున్నాయి.
ఉద్దేశపూర్వకంగా ఫోటోలను వీడియోలను పెట్టి మరీ సినిమాలో చూపించిందంతా తప్పనే రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఆదిపురుష్ ఇప్పటిదాకా వచ్చిన రామాయణ కథల్లో ఉత్తమ చిత్రమని ఎవరూ చెప్పరు. కాస్త టెక్నాలజీ వాడకం ఎక్కువైపోయి సాంప్రదాయ ప్రేక్షకులకు దర్శకుడు ఓం రౌత్ టేకింగ్ పట్ల మిశ్రమ స్పందన కలిగిన మాట వాస్తవం. అయితే అందరికీ కాదు.
Also Read – దానం: గోడ మీద పిల్లి మాదిరా.?
ఒకవేళ అదే నిజమైతే మొదటి రోజు 140 కోట్ల వసూళ్లు కళ్లజూసేది కాదు. రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ లో మంచి ట్రెండ్ చూపించేది కాదు. మరి పనిగట్టుకుని ఆదిపురుష్ మీద నెగటివ్ ట్వీట్లు పోస్టులు వేయిస్తున్నది ఎవరు. ఇప్పటికి ఇలాంటివి లక్షల్లో కనిపిస్తూనే ఉన్నాయి. వీటి కోసం ప్రత్యేకంగా ఒక టీమ్ తయారైపోయి మీమ్స్ తయారు చేయించి వాట్సప్, టెలిగ్రామ్ తదితర గ్రూపుల్లో వాటిని వైరల్ చేయమని మెసేజులు పెడుతున్నారు.
అక్కడితో ఆగకుండా ఇన్ఫ్లూయన్సర్స్ (భారీ ఫాలోయర్స్ ఉన్న హ్యాండిల్స్)కి డబ్బులు ఆఫర్ చేసి మరీ ట్రోల్ చేయమని ప్రోత్సహిస్తున్నారు. ఊరికే వచ్చే సొమ్మే కాబట్టి ఫేక్ ఐడిలతో నడిపే ట్విట్టర్ బ్యాచులు వెంటనే రంగంలోకి దిగిపోయి ఆదిపురుష్ వల్ల మొత్తం హిందూ ధర్మానికే నష్టం వచ్చిందనేలా ప్రచారం మొదలుపెడుతున్నారు.
Also Read – నారాయణ.. శల్యసారధ్యం చేస్తున్నారా?
వందలాది నెటిజెన్లు ఈ బాట్స్ మాయలో పడి ఆదిపురుష్ మీద విషం చిమ్మే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పని అంటే కొట్టిపారేయలేం. మరోవైపు ప్రభాస్ స్టార్ డం చూసి ఓర్వలేని కొన్ని బాలీవుడ్ వర్గాలు పనిగట్టుకుని ఇలా దిగజారి నెగటివ్ ప్రాపగాండా చేస్తున్నాయన్న వెర్షన్ కూడా తీసిపారేసేది కాదు.
ఆదిపురుష్ చివరి ఫలితం ఏమవుతుందన్నది సమస్య కాదు. ప్రీమియర్ జరిగిన కేవలం గంటల వ్యవధిలోనే ఇలా టాలీవుడ్ సినిమాను బజారుకీడ్చాలన్న పని మాత్రం నిజంగా ఖండించదగినదే. అయినా విమానంలో ఉన్న టాలీవుడ్ స్థాయిని కింద బస్సు కిటికీలో నుంచి చూసి వెక్కిరించి ఏదో సాధించామని ఫీలవుతున్న అమాయకత్వానికి నవ్వుకోవడం తప్ప ఎవరు మాత్రం చేయగలిగింది ఏముంది.
Also Read – వాఘా మూసేసి సరిహద్దులు తెరుస్తామంటున్న పాక్ పాలకులు!