
ఏ రాజకీయ నాయకుడైన తన పార్టీ, తమ కూటమి విధానాలకు అనుగుణంగానే మాట్లాడుతుంటారు. వ్యవహరిస్తుంటారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగస్వామిగా ఉన్నందున సిఎం చంద్రబాబు నాయుడు కూడా అందుకు అనుగుణంగానే మాట్లాడటం చాలా సహజం.
తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు, తమిళనాడులో డీఎంకే పార్టీ కేంద్రం ప్రతిపాదిస్తున్న జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజనని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
Also Read – డీలిమిటేషన్: రాజకీయ లెక్కలు సరిచూసుకోవలసిందే!
దాని వలన తక్కువ జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాధాన్యత తగ్గి, ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల పెత్తనం కొనసాగుతుందని తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, స్టాలిన్, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాదిస్తున్నారు. దేశంలో తక్కువ జనాభా కలిగిన ఇతర రాష్ట్రాలు కూడా ఈ ప్రతిపాదనని వ్యతిరేకిస్తున్నాయి.
అయితే సిఎం చంద్రబాబు నాయుడు దీనిపై సునిశిత వ్యాఖ్యలు చేశారు. ఊహాజనీతమైన ఈ ప్రతిపాదనపై ఇప్పుడే వాదోపవాదాలు అనవసరం. సమయం వచ్చినప్పుడు తప్పకుండా దీనిపై మా అభిప్రాయం తెలియజేస్తాము. అయితే దక్షిణాదితో సహా దేశవ్యాప్తంగా జనాభా పెరగాల్సిన అవసరం ఉంది. లేకుంటే భవిష్యత్‌లో తీవ్రమైన మానవ వనరుల కొరత ఏర్పడుతుంది. కనుక తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలలో జనాభా పెరుగుదలకు ఆయా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. ఏపీలో ‘తల్లికి వందనం’ పధకంతో కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15,000 చొప్పున అందించి ప్రోత్సాహిస్తున్నాము,” అని అన్నారు.
Also Read – ఊరిస్తూనే…ఉసురుమనిపిస్తుందే..!
వరల్డ్ మీటర్ ప్రకారం ప్రస్తుతం భారత్ జనాభా 146 కోట్లు. కనుక నానాటికీ జనాభా పెరిగిపోతోందని అందరూ ఆందోళన చెందుతుంటే, సిఎం చంద్రబాబు నాయుడు జనాభా ఇంకా పెరగాలని, అందుకు ప్రభుత్వాలు ప్రోత్సహించాలని చెప్పడం చాలా మంది జీర్ణించుకోలేరు.
ఒకప్పుడు ఇద్దరూ లేక ముగ్గురు పిల్లలు చాలు.. కుటుంబ నియంత్రణ పాటించమని ప్రభుత్వాలు చాలా జోరుగా ప్రచారం చేసేవి. కానీ ఇప్పుడు అటువంటి ప్రచారం చేయకపోయినా దేశంలో మద్యతరగతి నుంచి ఉన్నత ఆదాయ వర్గాల వరకు అందరూ ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకుంటున్నారు. ఈ కారణంగా 2050 నాటికి భారత్ జనాభా 150 కోట్లకు పడిపోతుందని వరల్డ్ మీటర్ అంచనా వేస్తోంది.
Also Read – ఆంధ్ర అంటే ఇంకా నామోషీయేనా కేటీఆర్‌జీ?
చైనా చాలా దశాబ్ధాలపాటు చాలా కటినంగా జనాభా నియంత్రణ చేయడం వలన ఇప్పుడు ఆ దేశంలో యువ జనాభా శాతం కంటే వృద్ధుల శాతం ఎక్కువగా ఉంది. దీని వలన చైనాలో మానవ వనరుల కొరత ఏర్పడింది. కనుక ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనమని ప్రోత్సాహిస్తోంది. ఇప్పుడు చైనా ఎదుర్కొంటున్న సమస్యే భవిష్యత్‌లో భారత్ కూడా ఎదుర్కోబోతోందని సిఎం చంద్రబాబు నాయుడు గ్రహించారు. కనుకనే జనాభా పెరుగుదల అవసరమని నొక్కి చెపుతున్నారు. కనుక ఎంతో దూరదృష్టితో ఆలోచించి మాట్లాడే ఆయన మాటలకు ఓ ఖచ్చితమైన లెక్క ఉంటుంది.
ఎంతో మేధావులమని భావించే మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ వంటివారు ఏనాడైనా ఇటువంటి అంశాల గురించి ఇంత లోతుగా ఆలోచించి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా?