రాష్ట్రపతి లేదా ప్రధానిని ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రధాన ప్రతిపక్ష నేతలు కలుస్తుంటారు. ఆ భేటీలకు రేపు ప్రధాని మోడీతో మంత్రి నారా లోకేష్ భేటీకి తేడా ఉందనిపిస్తోంది. నారా లోకేష్ ఇప్పటికే పలుమార్లు ప్రధాని మోడీ, కేంద్రమంత్రులను కలిశారు. కనుక నారా లోకేష్ రాజకీయంగా ఓ మెట్టు పైకి ఎక్కిన్నట్లు భావించవచ్చు.
కేంద్రంతో బంధాన్ని నిర్మాణాత్మకంగా ఉపయోగించుకుంటే దాని ఫలితాలు ఏవిదంగా ఉంటాయో ఏపీలో టీడీపిని కూటమి ప్రభుత్వాన్ని చూస్తే అర్ధమవుతుంది. అదే… విధ్వంసకర రాజకీయాలు చేస్తే ఏవిదంగా ఉంటుందో ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీల పతనం చూస్తే అర్ధమవుతుంది. సిఎం చంద్రబాబు నాయుడు నిర్మాణాత్మకమైన వైఖరితో ముందుకు సాగుతున్నారు. కనుక సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. అటువంటి నిర్మాణాత్మకమైన ప్రయత్నమే ఇది కూడా అనుకోవచ్చు.
మంత్రి నారా లోకేష్ రేపు ప్రధానితో ఏం చర్చించబోతున్నారనేది చాలా ఆసక్తికరం. రాష్ట్రానికి సంబందించిన ప్రాజెక్టులు, నిధులు వగైరాలపై చర్చ చాలా కామన్. వార్తలలో కూడా అవే వస్తాయి.
కానీ రాష్ట్రంలో మద్యం కుంభకోణం కేసు విచారణ క్లైమాక్స్ చేరుకుంది కనుక దానిపై ‘ముందుకు సాగేందుకు’ ప్రధాని మోడీని మంత్రి నారా లోకేష్ అనుమతి కోరనున్నారా? అందుకే సిఎం చంద్రబాబు నాయుడు పంపించారా?కానీ రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించే ఇటువంటి కీలకమైన వ్యవహారాల గురించి ప్రధాని మోడీతో చర్చించేందుకు సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా వెళతారు కానీ నారా లోకేష్‌ని పంపించరు కదా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నప్పటికీ ఇటువంటి కీలక నిర్ణయాలలో యువకుడైన నారా లోకేష్‌ని బాధ్యుడిని చేస్తేనే కదా సత్తా ఏమిటో తెలుస్తుంది?అనే అభిప్రాయాలు కూడా వినపడుతున్నాయి.
ఇంతకీ ప్రధాని మోడీతో నారా లోకేష్ భేటీకి అసలు కారణం ఏమిటనేది అయన తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగే పరిణామాలతో స్పష్టమవుతుంది. ఒకవేళ మద్యం కుంభకోణం కేసులో జగన్‌కి నోటీస్ వెళితే, అది ఈ భేటీ ఫలితంగానే చూడాల్సి ఉంటుంది.




