జగన్ అలా మాట్లాడినా పవన్ ఆ టాపిక్ ఎత్తలేదు

Why Pawan Kalyan JanaSena Silent on YS Bharathi ED Caseఇటీవలే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పరుష వ్యాఖ్యలు చేశారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకుని నీతులు మాట్లాడుతున్నాడని, ఇలా మనం చేస్తే బొక్కలో వేసే వారు కదా అని మీడియా ముందు ప్రశ్నించారు. రాజకీయాల్లో పర్సనల్ విమర్శలకు చోటు లేదని పలువురు జగన్ ను విమర్శించారు కూడా.

[m9ad]

ADVERTISEMENT

మరోవైపు జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి పేరు కూడా భారతి సిమెంట్స్ పెట్టుబడుల కేసులో చేర్చింది ఈడీ. ఆ కేసులో ఆమెను ఐదవ ముద్దాయిగా చేర్చింది ఈడీ. దీనిపై టీడీపీ వైకాపా నేతల మధ్య వాడీ వేడిగా మాటల యుద్ధం జరుగుతుంది. అయినా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఆ విషయం ప్రస్తావించలేదు.

జగన్ దిగజారి మాట్లాడినా మనం ఇంట్లో ఆడవారి గురించి మాట్లాడకూడదని ఆయన జనసేన నాయకులకు చెప్పినట్టు సమాచారం. దీనితో ఇప్పటివరకు ఆ పార్టీ నేతలేవరు ఈ విషయంపై స్పందించడం లేదు. జగన్ ఎంతో దిగజారి ఆయన పై విమర్శలు చేసినా పవన్ కళ్యాణ్ ఈ విషయంలో హుందాగా వ్యవహరించారనే చెప్పుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories