మోడీపై పవన్ కళ్యాణ్ అప్పుడైనా పెదవి విప్పుతారా?

Why Pawan Kalyan Silent on Narendra Modiజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నాటకలో జెడిఎస్ తరపున ప్రచారం చేయబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ , ఎమ్.ఐ.ఎమ్. అదినేత ఒవైసీలు జెడి ఎస్ కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తర కర్ణాటకలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేస్తారని జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామి తెలిపారు.

ADVERTISEMENT

ఉత్తర కర్ణాటక ప్రాంతం తెలంగాణలోని హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు జిల్లాలకు అనుబంధంగా ఉన్న నేపథ్యంలో పవన్‌తో ఇక్కడ ప్రచారం చెయ్యబోతున్నారు. ఆ ప్రచారం సంధర్భంగానైనా ఆయన మోడీపై పెదవి విప్పుతారేమో చూడాలి.

మైనింగ్ కుంభకోణంలో మూడు ఏళ్ళు జైలుకు వెళ్లొచ్చిన గాలి జనార్ధనరెడ్డికి కావాల్సిన వారికి దాదాపుగా 9 టిక్కెట్లు ఇచ్చింది బీజేపీ. గాలి ముఖ్య అనుచరుడు శ్రీరాములు బీజేపీ అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తుంది. గాలి సోదరుడు సోమశేఖరరెడ్డి స్వయంగా బళ్లారి నుండి పోటీ చేస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories