Hero Saif Ali Khan

ఆదిపురుష్, దేవర సినిమాలలో నటించిన బాలీవుడ్‌ నటుడు సైఫ్ ఆలీ ఖాన్‌ తెలుగు సినీ పరిశ్రమకి, ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

సైఫ్ ఆలీ ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తిని ముంబయి పోలీసులు గాలించి పట్టుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు అతను హత్యాయత్నం చేశాడా లేదా?అని వాదనలు జరగాల్సి ఉండగా అతను భారతీయుడా బాంగ్లదేశీయుడా? ముంబయికి ఎప్పుడు వచ్చాడు?అనే రెండు పాయింట్స్ మీద వాదోపవాదాలు జరగడం గమ్మత్తుగా అనిపిస్తుంది. కోర్టు అతనికి రెండు వారాల జ్యూడిషియల్ రిమాండ్‌ విధించి, 5 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఇది మన పాయింట్ కాదు.

Also Read – సిఎం కంటే మంత్రులకే మంచి ర్యాంక్స్… భళా!

రెండు పెద్ద తెలుగు సినిమాలలో నటించిన ఆయన ఓ దొంగ చేతిలో కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకునప్పుడు, టాలీవుడ్‌ ప్రముఖులు ముంబయి వెళ్ళి పరామర్శించకపోయినా కనీసం ట్వీట్స్ వేయొచ్చు. కానీ ఒకరిద్దరు తప్ప ఎవరూ ట్వీట్స్ కూడా వేయలేదు. బహుశః అల్లు అర్జున్‌ ఎఫెక్ట్ వల్ల కావచ్చు.

అల్లు అర్జున్‌ జైలు నుంచి విడుదలై ఇంటికి తిరిగిరాగానే యావత్ తెలుగు సినీ ప్రముఖులు ఆయనని పరామర్శించడానికి క్యూ కట్టారు. ఆ కారణంగా టాలీవుడ్‌ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి గురయ్యింది. ప్రివిలేజ్ షోలు, టికెట్ ధరల పెంపులు కోల్పోయింది. ఇప్పట్లో ఈ పరిస్థితి మళ్ళీ మారే అవకాశం కూడా కనిపించడం లేదు.

Also Read – దెబ్బలు పడతాయ్ రాజా..

ఇప్పుడు టాలీవుడ్‌లో పాన్ ఇండియా మూవీలు చాలా కామన్. కనుక మహారాష్ట్రతో సహా ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి సైఫ్ ఆలీ ఖాన్‌పై ఎటువంటి అభిప్రాయాలున్నాయో తెలీదు. కనుక ఆయనకు మద్దతుగా ట్వీట్స్ వేసి పాన్ ఇండియా స్థాయిలో సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకని టాలీవుడ్‌ పెద్దలు అనుకున్నారో ఏమో అందరూ ‘సైలంట్ మోడ్’లో ఉండిపోయారు. బహుశః ఫోన్ చేసి పరామర్శించారేమో తెలీదు.




కానీ అల్లు అర్జున్‌ పుణ్యమాని ఇప్పుడు టాలీవుడ్‌లో ఎవరు ఎవరికీ బహిరంగంగా సంఘీభావం తెలుపలేరు.. మద్దతుగా ట్వీట్స్ వేయలేరని మాత్రం స్పష్టమైంది!

Also Read – జగన్‌కి విరుగుడు వారిద్దరే… ఏమవుతుందో?