కవిత కూడా బాబు మనిషి అవుతారా.?

Why YSRCP, BRS Keep Blaming Chandrababu Naidu

వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలకు ఏమైనా రాజకీయ ఎదురు దెబ్బలు తగిలినా, అలాగే వారికి, వారి పార్టీలకు ఎవరి నుంచైనా రాజకీయ ఇబ్బందులు ఎదురైనా అందుకు కారణం నారా చంద్రబాబు నాయుడే అంటూ ఇరు పార్టీల అధినేతల నుంచి పార్టీ క్యాడర్ వరకు అందరు బాబు భజన చేస్తారు.

వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య తండ్రి ఆస్తిలో వాటాల కోసం అన్నా చెల్లెళ్ళ మధ్య మొదలైన వివాదాలు కాస్త రాజకీయంగా మారాయి. దానితో చివరికి అన్న వైసీపీ కి వ్యతిరేకంగా చెల్లి షర్మిల కాంగ్రెస్ లో చేరి జగన్ ఓటమి కోసం వైసీపీ పతనం కోసం పని చేస్తున్నారు.

ADVERTISEMENT

అలాగే వైఎస్ సోదరుడు వివేకా దారుణ హత్య పట్ల కూడా వివేకా సతీమణి, అతని కుమార్తె సునీత నుంచి షర్మిల వరకు అన్ని వేళ్ళు వైసీపీ వైపే వేలెత్తి చూపుతున్నాయి, జగన్ బంధువునే దోషిగా నమ్ముతున్నాయి.

అయితే వీటన్నిటికీ చంద్రబాబు నాయుడే కారణం అని వివేకా కుమార్తె సునీత నుంచి జగన్ సోదరి షర్మిల వరకు అందరు బాబు మనుషులే అంటూ వైసీపీ అధినేత జగన్ నుంచి ఆ పార్టీ కార్యకర్త వరకు, వైసీపీ ఆత్మసాక్షి సాక్షి నుంచి వైసీపీ సోషల్ మీడియా వరకు అందరు పెద్ద ఎత్తున ప్రచారం చేసారు, ఇప్పటికి చేస్తున్నారు కూడా.

2024 ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరుపున ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న షర్మిల పసుపు చీర కట్టుకున్నారని, షర్మిల బాబు మనిషే అని చెప్పడానికి ఇంతకన్నా రుజువులు కావాలా అంటూ చెల్లి చీర రంగు పై నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ చేసిన విమర్శలు వివాదాస్పదంగా మారాయి.

దీనితో షర్మిల, జగన్ కు బాబు ఫోబియా పట్టుకుందని, ఆయనకు అద్దంలో ముఖం చూసుకున్నా బాబే కనిపిస్తున్నారంటూ అన్న జగన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అలాగే అటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఆ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎంపికైన అందుకు బాబే కారణం అంటూ వాదించింది వైసీపీ.

ఇక తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా గతంలో టీడీపీ నేత కావడంతో రేవంత్ ను కూడా బాబు మనుషుల ఖాతాలో లెక్కిస్తారు వైసీపీ నేతలు. అయితే వైసీపీ, బిఆర్ఎస్ మధ్య ఉన్న రాజకీయ అనుబంధం దృష్ట్యా బిఆర్ఎస్ కూడా టీడీపీ విషయంలో, బాబు అంశంలో వైసీపీ వాదనలకు వంత పాడుతుంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ ను చంద్రబాబు నాయుడు శిష్యుడిగా అభివర్ణిస్తారు బిఆర్ఎస్ నేతలు. ఇందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదలుకుని పార్టీ ముఖ్య నేత అయిన హరీష్ వరకు బాబు ని గురువుగా రేవంత్ ని శిష్యుడిగా ప్రచారం చేస్తూ రేవంత్ ని బాబు మనిషి అంటూ విమర్శలకు దిగుతారు.

అలాగే కల్వకుంట్ల కుటుంబంలో మొదలైన కుటుంబ వివాదాలు కూడా కేసీఆర్ బిఆర్ఎస్ గా కవిత తెరాస గా విభజించబడడం తో ఇక బిఆర్ఎస్ పై కవిత రాజకీయ యుద్ధం ప్రకటించింది. బిఆర్ఎస్ అధినేత, సొంత తండ్రి కేసీఆర్ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సొంత అన్న కేటీఆర్ వరకు కవిత ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు అనేలా ఆ పార్టీ నేతల పై విరుచుకుపడుతున్నారు.

కేసీఆర్ ని మర మనిషి అని, హరీష్ ని కోవర్ట్, కట్టప్ప అని, గుంటనక్క అని, కేటీఆర్ కి నాయకత్వ లక్షణాలు లేవని, సంతోష్ రావు ఒక అవినీతి తిమింగిలం అని ఇలా పార్టీ ముఖ్యనేతలందరి మీద కవిత తన విమర్శలతో తగ్గేదెలా అన్నట్టుగా రెచ్చిపోతున్నారు.

ఇటువంటి తరుణంలో బిఆర్ఎస్ పై కవిత ఎక్కుపెట్టిన తెరాస బాణం కూడా బిఆర్ఎస్, టీడీపీ ఖాతాలోకే వస్తుందా.? అలాగే తెరాస పార్టీ జెండాలో పసుపు రంగును ఉంచిన కవితను కూడా కేటీఆర్ బాబు మనిషిగా చిత్రీకరిస్తారా.?

ADVERTISEMENT
Latest Stories