aravind-kejriwal Aam Aadmi Party wins again in delhi

ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో భాగంగా నేడు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 70 స్థానాలకు 669 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఈరోజు మద్యాహ్నం ఒంటిగంట వరకు 33.31 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

ఢిల్లీ నుంచే యావత్ దేశాన్ని పాలిస్తున్న ప్రధాని మోడీకి, దేశ రాజకీయాలను శాశిస్తున్న అమిత్ షాకి ఆమాద్మీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పక్కలో బల్లెంలా మారారు. ఆయనని ఏవిదంగా ఓడించాలో అర్దం కావడం లేదు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలలో ఓడించాలని ప్రయత్నిస్తే రెండుసార్లు చీపురుకట్టతో బీజేపిని ఊడ్చిపడేశారు.

Also Read – కథ నచ్చితే ‘అమ్మ’ అయినా ‘అమ్మమ్మ’యినా ఒకే..

ఆమాద్మీ ఎమ్మెల్యేల చేత తిరుగుబాటు చేయించి దొడ్డి దారిన అధికారం కైవసం చేసుకోవాలనుకుంటే అరవింద్‌ కేజ్రీవాల్‌ అదీ సాధ్యపడనీయలేదు. ఇలా కాదని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్‌ చేసి జైలుకి పంపిస్తే అరవింద్‌ కేజ్రీవాల్‌ ఏమాత్రం జంకలేదు. జైల్లో నుంచే పాలన సాగించారు.

సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో బయటకు రాగానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ కుర్చీలో పార్టీలో సీనియర్ నాయకురాలు అతిశీని కూర్చోబెట్టి, “నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని ఢిల్లీ ప్రజలు నమ్మి మళ్ళీ నన్ను, నా పార్టీని గెలిపిస్తేనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొంటాను లేకుంటే లేదు. పదవి, అధికారంపై నాకు వ్యామోహం లేదంటూ” ప్రజల మద్యకు వెళ్ళి సానుభూతి పొందేందుకు, వారి నమ్మకం పొందేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు.

Also Read – అమ్మకు ప్రేమతో ఒకరు….అమ్మ మీద ద్వేషంతో మరొకరు…

ఈవిదంగా ప్రతీ ఎత్తుకు పైఎత్తు వేస్తూ దూసుకుపోతున్న అరవింద్‌ కేజ్రీవాల్‌ని ఈసారి ఓడించలేకపోతే మరెన్నటికీ బీజేపి ఢిల్లీ పీఠం దక్కించుకోలేదు. ఒకవేళ బీజేపి చేతిలో ఆమాద్మీ ఓడిపోతే మళ్ళీ ఎన్నటికీ అధికారంలోకి రానీయకుండా తొక్కేయకుండా ఉండదు. కనుక రెండు పార్టీలకు ఈ ఎన్నికలలో గెలవడం చాలా ముఖ్యం.

ఒకప్పుడు షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 15 ఏళ్ళపాటు ఢిల్లీ పీఠం కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉండేది. కానీ కాంగ్రెస్‌ హస్తంలో నుంచి అరవింద్‌ కేజ్రీవాల్‌ గుంజుకొని తీసుకున్నాక మళ్ళీ దానిని దక్కించుకోలేకపోతోంది. కనుక కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది చివరి అవకాశంగానే భావించవచ్చు.

Also Read – మోడీ “లీగల్లీ కన్వర్టర్ బీసీ”..?

ఒకవేళ ఈ ఎన్నికల మళ్ళీ ఆమాద్మీ గెలిచినా, బీజేపి గెలిచినా ఇక ఎన్నటికీ కాంగ్రెస్‌ చేతికి ఢిల్లీ పీఠం దక్కదు. కనుక అది కూడా సర్వ శక్తులు ఒడ్డి పోరాడింది.




ప్రాంతీయ పార్టీ అయిన ఆమాద్మీని ఓడించడానికి రెండు అతిపెద్ద జాతీయ పార్టీలు ప్రయత్నిస్తుంటే, అరవింద్‌ కేజ్రీవాల్‌ సింగిల్ సింహంలా వాటితో ఒంటరిగా పోరాడుతున్నారు. ఈ పోరాటంలో ఏ పార్టీ గెలుస్తుంది ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడితే తెలుస్తుంది.