బన్నీ డబల్ సెంచరీ కొడతాడా?

will allu arjun readh 100 crore club with Ala Vaikuntapuramlooటాప్ హీరోలలో బన్నీ, ఎన్టీఆర్, మహేష్ బాబులను 100 కోట్ల క్లబ్ ఎప్పటి నుండో ఊరిస్తుంది. ఎన్టీఆర్ అరవింద సమేతతో బాగా దగ్గరకు వచ్చినా అందుకోలేకపోయారు. మహేష్ బాబు మహర్షితో కొట్టడం ఖాయంగా కనిపించినా పని కాలేదు. ఇక బన్నీ పరిస్థితి అయితే చాలా ఘోరం. ఇంకా 70 కోట్ల క్లబ్ లోనే ఉండిపోయాడు.

2016లో విడుదలైన సరైనోడు 72 కోట్ల షేర్ తో బన్నీకెరీర్ బెస్ట్ గా ఉంది. ఆ తరువాత విడుదలైన డీజే, నా పేరు సూర్య కూడా అంతకు మించి దాటలేదు. అయితే ఇప్పుడు బన్నీ డబల్ సెంచరీ కొడతాడని అభిమానులు ధీమాగా ఉన్నారు. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సంక్రాంతి వస్తున్న అల వైకుంఠపురములో సీజన్ ఎఫెక్ట్ తో 100 కోట్ల షేర్ ఖాయమని వారు అంటున్నారు.

ADVERTISEMENT

ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్ కావడంతో సినిమా హైప్ పీక్స్ లో ఉంది. దానితో అల వైకుంఠపురములో మిగతా సంక్రాంతి సినిమాల కంటే కొంత ముందు ఉంది. ఆ తరువాత సుకుమార్ డైరెక్షన్ ఇంకో సినిమా చేస్తున్నాడు బన్నీ. సుకుమార్ ఇప్పటికే రామ్ చరణ్ కు రంగస్థలం తో 100 కోట్ల సినిమా ఇచ్చాడు.

పైగా బన్నీ సుకుమార్ కాంబినేషన్ అంటే ఆర్య, ఆర్య 2 హైప్ ఎలాగూ ఉంటుంది. దానితో అది కూడా 100 కోట్ల షేర్ ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభాస్, చిరంజీవిలకు మాత్రమే బ్యాక్ టూ బ్యాక్ 100 కోట్ల షేర్ సినిమాలు ఉన్నాయి. దీనితో 2020 బన్నీ కెరీర్ లో కీలకం కాబోతుంది.

ADVERTISEMENT
Latest Stories