Megastar Chiranjeevi

సినీ వినీలాకాశంలో గత కొన్ని దశాబ్దాలుగా మెగాస్టార్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న చిరంజీవి రాజకీయాలలో మాత్రం రాణించలేకపోయారు. ప్రజారాజ్యంతో మొదలైన చిరు పొలిటికల్ ఎంట్రీ కాంగ్రెస్ తో ముగిసిందా అంటే ముగిసినట్టే అంటుంటారు చిరు.

కానీ ఇంకా చాల మిగిలే ఉంది అంటు ఎప్పటికప్పుడు చిరు రాజకీయ రీ ఎంట్రీ మీద ఊహాగానాలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పవన్ కు చెక్ పెట్టడానికి జగన్ తన పార్టీ తరపున చిరుని రాజ్యసభకు పంపబోతున్నారు అంటూ ముమ్మరమైన ప్రచారం జరిగింది.

Also Read – గెట్ రెడీ..స్టే ట్యూన్డ్ టూ ‘తాడేపల్లి ఫైల్స్’..!

అయితే అవి వాస్తవ రూపంలో కార్యాచరణ కాలేకపోయాయి. ఇక ఇప్పుడు ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయినా రాజ్యసభ సీటును బీజేపీ చిరంజీవితో ఫుల్ ఫిల్ చేయాలనుకుంటుంది అంటూ మరో ప్రచారం ఊపందుకుంది.

ఇప్పటికే జనసేన తో సన్నిహిత సంబంధం కలిగిన బీజేపీ అధిష్టానం, పవన్ ను పూర్తిగా తమ వైపు తిప్పుకోవడానికి తన అన్న చిరంజీవికి రాజ్యసభ ప్రతిపాదన తెర మీదకు తెచ్చినట్టు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరు లో 150 ఎకరాల్లో నిర్మించిన ఎక్స్ పిరీయమ్ పార్క్ ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి పాల్గొన్న చిరు బీజేపీ ప్రతిపాదనకు మొగ్గు చూపుతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read – తెలుగు సినిమాలకు తెలంగాణ తలుపులు మూసుకుపోయిన్నట్లేనా?

రాజకీయాలు తనకు సరిపడవని, తానూ ఒక పార్టీకి మద్దతుదారుడిగా ఉంటూ కొందరి వాడుగా మిగిలిపోవాలని లేదని, తానూ ఎప్పటికి అందరి వాడుగానే ఉంటానంటూ చిరు పలుమార్లు మీడియా ముఖంగా పొలిటికల్ పార్టీలకు కూడా తన సందేశాన్ని అందించారు. అయినప్పటికీ చిరు పొలిటికల్ రీ ఎంట్రీ మీద ఎప్పటికప్పుడు వార్తలు ప్రచారంలోకి వస్తూనే ఉంటున్నాయి.




ఒకసారి వైసీపీ ఈ ప్రచారాన్ని తెరమీదకు తెస్తే మరోమారు బీజేపీ ఈ ఊహాగానాలకు ఊతమిచ్చింది. అయితే సినీ రంగంతో పాటుగా రాజకీయ రంగంలో కూడా అందరి వాడుగా ఉండాలి అని ఆశ పడుతున్న చిరంజీవిని బీజేపీ తన వ్యూహాలతో అందుకోగలదా.? అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా చిరు తిరిగి రాజకీయాల వైపు మొగ్గు చూపుతారు అనుకోవడం బీజేపీ అత్యాశే అవుతుందేమో.

Also Read – విశాఖ రైల్వే జోన్‌కి ఇన్ని తిప్పలా?